విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. బుధవారం పున్నమితోట ధోభీ ఖాన వద్ద 10లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించిన షేడ్ లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తో కలిసి అవినాష్ ప్రారంభించారు. తదనంతర ఇటీవల ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ని కలిసి Ss కన్వెన్షన్ దగ్గర మంజూరు అయిన షాది ఖాన త్వరగతిన నిర్మాణం చేపట్టమని మరియు ఫకీరుగూడెం ఇండ్ల పట్టాలు ఇప్పించమని కోరగా ఆయన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని క్షేత్రస్థాయిలో పరిశీలించి వీలైనంత త్వరగా ఆ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ స్థానిక సంస్థ ఎన్నికల ప్రచార సమయంలో ఇక్కడ పని చేసే రజక సోదరులు వారికి సౌకర్యం గా ఉండేలా షేడ్స్ కావాలని కోరగా నాడు ఇచ్చిన మాట ప్రకారం జులైలో శంకుస్థాపన చేసి కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఎలాంటి నాణ్యత లోపం లేకుండా పూర్తి చేసి నేడు వారికి అందుబాటులో కి తీసుకురావడం జరిగిందని అన్నారు. మాది చేతల ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు అనడానికి ఇదే నిదర్శనం అని తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వములో అయితే శంకుస్థాపన లు చేసి వదిలేసేవారని మరలా వాటి గురుంచి పట్టించుకొనే వారు కాదని విమర్శించారు. అదేవిధంగా నియోజకవర్గంలో శంకుస్థాపన చేసిన ప్రతి పనిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తెస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,19వ డివిజన్ కార్పొరేటర్ రహేన నాహిద్,కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ అలీమ్,రజక సంఘం సభ్యులు శ్రీనివాసరావు, నాగరాజు, ఏడుకొండలు , నాగు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
రైతులకు కలుగు ఉపయోగాల గురించి పరిశీలన…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “ఒక జిల్లా ఒకఉత్పత్తి” గుంటారు మిర్చి పైన ఢిల్లీ PMO ఆఫీసులో ODOP …