Breaking News

వ్యోమగామి అవ్వాలనే కల సాకారానికి సి.ఎం.ఆర్థిక సహాయం

-ప్రభుత్వపరంగా రూ.50లక్షల ఆర్థిక సహాయ చెక్కును అందజేసిన సమాచార శాఖ మంత్రి
-ఆర్థిక సహాయం అందజేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెల్పిన దంగేటి జాహ్నవి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి వ్యోమగామి అవ్వాలనే కలను సాకారం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రూ.50 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమం మరియు సినిమాటోగ్రఫీ మంత్రి సిహెచ్. శ్రీనివాస వేణు గోపాల కృష్ణ బుధవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లో దంగేటి జాహ్నవి కి ముఖ్యమంత్రి మంజూరు చేసిన రూ.50 లక్షల చెక్కును అందజేస్తూ అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఒక పేద విద్యార్థి కలను సాకారం చేస్తూ ఆర్థిక సహాయాన్ని అందజేసిన ముఖ్యమంత్రి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. చదవాలనే తపన ఉండి, చదివి, ఎదిగి ఈ దేశానికి కీర్తిని తేవాలనే నిరుపేద విద్యార్థులకు ముఖ్యమంత్రి అండ అందనంత ఎత్తుగా ఉంటుందని ఆయన అన్నారు. బడుగు బలహీన వర్గాల వారి ఉన్నతికి విద్యా విప్లవాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి నిరుపేదలకు ఎప్పుడూ అండగా ఉంటారని కొనియాడుతూ ధన్యవాదాలు తెలిపారు.
వ్యోమగామి అవ్వాలనే లక్ష్యంతో అంతర్జాతీయ పైలెట్ కోర్సు లో శిక్షణ పొందేందుకు కుటుంబ ఆర్థిక స్థితి సహకరించదనే నిరాశ, నిస్పృహ లో ఉన్న దంగేటి జాహ్నవి గత వరదల సమయంలో రాజమండ్రి పట్టణంలో పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రిని కలిసి తన సమస్యను చెప్పుకున్నదన్నారు. ఆయన సానుకూలంగా స్పందిస్తూ నెల రోజుల కాలవ్యవదిలోనే ఈ ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారన్నారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్బంగా దంగేటి జాహ్నవి మాట్లాడుతూ పంజాబ్ లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న తాను వ్యోమగామి అవ్వాలనే తపన ఎంతగానో ఉందన్నారు. ఆ లక్ష్యంతోనే నాసాతో పాటు పోలాండ్ లో అనలాగ్ ఆస్ట్రోనాట్ శిక్షణ పొందడం జరిగిందన్నారు. అయితే వ్యోమగామికి అంతర్జాతీయ సంస్థలో పైలెట్ శిక్షణ పొందాల్సి ఉందన్నారు. కానీ అందుకు తన కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించ నందున ఆర్థిక సహాయం నిమిత్తం ముఖ్యమంత్రిని కలిసిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందిస్తూ నెల రోజుల కాలవ్యవధిలోనే ఆర్థిక సహాయాన్ని అందజేశారంటూ ఆయనకి ధన్యవాదములు తెలిపింది. ముఖ్యమంత్రి అందించిన ఈ సహాయాన్ని ఎన్నటికీ మరులేనని, వారి దీవెనలతో త్వరలోనే ఈ శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తాని ఆమె తెలిపారు.
ప్రభుత్వ చీఫ్ విఫ్ ముదునూరి ప్రసాద రాజు, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ కౌరు శ్రీనివాసరావు, దంగేటి జాహ్నవి కుటుంభ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *