Breaking News

ఏపీ ఇంధన సామర్థ్య గృహ నిర్మాణం భేష్

-‘అంగన్’ అంతర్జాతీయ సదస్సులో ప్రతినిధులను ఆకర్షించిన కార్యక్రమాలు
-పథకం చాలా ప్రత్యేకమైందని.. లబ్ధిదారులకు ఉత్తమ సౌకర్యాలు అందుతాయని ప్రశంస
-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన భారీ పథకాన్ని వివరించిన అధికారులు
-భవన నిర్మాణ రంగంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుకు ఎకో నివాస్ కోడ్ రూపొందించిన ఏపీఎస్ఈసీఎం
-ఇంధన సంరక్షణ కార్యక్రమాల అమలులో ఏపీకి సంపూర్ణ సహకారం
-హామీ ఇచ్చిన బీఈఈ అధికారులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’’ అనే భారీ గృహనిర్మాణ ప్రాజెక్టులో ఇంధన సామర్థ్య సాంకేతికతలను అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అంతర్జాతీయ సదస్సులో ప్రతినిధుల దృష్టిని ఆకర్షించాయి.ఢిల్లీలో జరిగిన అంగన్ (ఆగ్మెంటింగ్నేచర్ బై గ్రీన్ అఫర్డబుల్ న్యూ-హాబిటాట్) అంతర్జాతీయ సదస్సుకు అనేక దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదస్సులో పలువురు ప్రతినిధులు ఇంధన సామర్థ్య గృహాల కార్యక్రమం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం చాలా ప్రత్యేకమైనదని, లబ్ధిదారులకు ఉత్తమ నివాస సౌకర్యాన్ని అందించడానికి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికిదోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
కేంద్ర విద్యుత్తు శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) ఆధ్వర్యంలో అంగన్ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ గృహ నిర్మాణ పథకంలో అమలు చేస్తున్న ఇంధన సామర్థ్య చర్యల గురించి అధికారులు వివరించారు.అల్పాదాయ వర్గాల వారికి ఇళ్లు, భవన నిర్మాణ రంగంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా విద్యుత్తు ఆదాతో పాటు పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గృహ నిర్మాణ పథకం ఫేజ్ 1, 2ల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.34,309 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించినట్లు ఎస్ఈసీఎం ఉన్నతాధికారి తెలిపారు. నీటి సరఫరా కోసం రూ.4128 కోట్లు, విద్యుత్తు, ఇంటర్నెట్ కోసం రూ.7989 కోట్లు, సీసీ రోడ్లు వేయడానికి రూ.10,251 కోట్లు, మురుగు కాలువల నిర్మాణానికి రూ. 7337 కోట్లు, యూఎల్బీమౌలిక సదుపాయాలకు రూ.5204 కోట్లు వెచ్చిస్తున్నట్లు వివరించారు.
ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) తక్కువ ధరకే లబ్దిదారులకు ఇంధన సామర్థ్య ఉపకరణాలను అందించడానికి ముందుకు వచ్చిందని కూడా జైన్ తెలిపారు. ఈ విషయానిన సీఎం జగన్మోహన్ రెడ్డికి వివరించినట్లు పేర్కొన్నారు. ఇంటర్నెట్‌ సహా లబ్ధిదారులకు అత్యుత్తమ సేవలను అందించాలని ఆయన యోచిస్తున్నారన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ పథకంలోని 28.3 లక్షల మంది లబ్ధిదారులకు దశలవారీగా ఇంధన సామర్థ్య ఉపకరణాలను సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ కార్యక్రమం కింద మొదటి దశలో నిర్మిస్తున్న 15.6 లక్షల ఇళ్లకు దశలవారీగా ఒక్కో ఇంటికి 4 ఎల్‌ఈడీబల్బులు, 2 ఎల్‌ఈడీ ట్యూబ్ లైట్లు, 2 ఇంధన సామర్థ్య ఫ్యాన్లు సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. దీని వలన ప్రతి ఇంటికి సంవత్సరానికి 734 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. 15.6 లక్షల ఇళ్లకు ఇంధన సామర్థ్య ఉపకరణాలను ఉపయోగించడం ద్వారా సంవత్సరానికి 1145 MU ఆదా అవుతుందని అధికారులు తెలిపారు.
2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం వార్షిక ఇంధన డిమాండ్ 60943 మిలియన్ యూనిట్లు కాగా.. గృహ వినియోగమే 17,514 మిలియన్ యూనిట్లు (28%) ఉందని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో నివాస భవనాల్లోనూ ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందన్నారు.ఇందుకోసం ఏపీఎస్ఈసీఎంప్రత్యేకంగా పర్యావరణ-నివాస్ సంహిత కోడ్‌ను సిద్ధం చేసింది.28.3 లక్షల ఇళ్ల నిర్మాణంలో నిమగ్నమైన 500 మందికి పైగా ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చిన గృహనిర్మాణ శాఖ ఉద్యోగులకు ఎకో-నివాస్ సంహిత (ఈఎన్‌ఎస్) కోడ్‌పై ఏపీఎస్‌ఈసీఎం శిక్షణా కార్యక్రమాలను నిర్వహించింది. గృహనిర్మాణ శాఖలోని మరో 650 మంది ఇంజనీర్లకు ఏపీసీడ్కోద్వారా ఇలాంటి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
గృహనిర్మాణ పథకంలో ఈ ఇంధన సామర్థ్య చర్యలు 20% విద్యుత్తును ఆదా చేయడంలో సహాయపడతాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఇంధన సామర్థ్య ప్రయోజనాలను అందించడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని చెప్పారు. ఈసీబీసీ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేస్తున్న వారికి ప్రోత్సాహకాలను అందించాలనిఏపీఎస్ఈసీఎం.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
ఆంధ్రప్రదేశ్‌తో సహా వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న అత్యుత్తమ ఇంధన సామర్థ్య పద్ధతుల గురించి అంతర్జాతీయ సదస్సుకు నోడల్ అధికారిగా ఉన్న బీఈఈడైరెక్టర్ సౌరభ్ దిదితో కలిసి బీఈఈ డైరెక్టర్ జనరల్అభయ్బాక్రేవివరించారు. భవన నిర్మాణ నిబంధనల్లో ఈసీబీసీని తప్పనిసరి చేసిన ఏపీ ప్రభుత్వాన్ని బీఈఈ అభినందించింది.
”30 లక్షల ఇళ్లను నిర్మిస్తున్న భారీ పథకంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేయాలని నిర్ణయించడం కీలకమైన అడుగు. ఇండో స్విస్బీఈఈపీ ఏపీకి మద్దతిస్తోంది. బీఈఈ ద్వారా ఈ మద్దతును కొనసాగించడం సంతోషంగా ఉంది’’ అనిస్విస్ ఏజెన్సీకి చెందిన జోనాథన్డెమెంగే చెప్పారు.
సరికొత్త నిర్మాణ పద్ధతులు, తక్కువ కార్బన్ శీతలీకరణ పద్ధతులు, సాంకేతికతలు, నగరాల్లో పర్యావరణ వ్యూహాలపై సదస్సులో ప్రతినిధులు చర్చలు జరిపారు. అన్ని రంగాలలో తక్కువ కార్బన్ ఉత్పత్తి అయ్యేలా చూసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు. కాగా, రాష్ట్రంలో ఇంధన పొదుపు, సామర్థ్య కార్యక్రమాల అమలులో ముఖ్యంగా బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సంపూర్ణ సహకారం అందిస్తామని బీఈఈ అధికారులు హామీ ఇచ్చారు.
వైఎస్ఆర్జగనన్న కాలనీలకు నాణ్యమైన విద్యుత్తు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు. జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం, ఆర్థిక అవకాశాలను విస్తరించడం ద్వారా లబ్ధిదారులకు ఆధునిక ఇంధన సౌకర్యాలను అందించడానికి ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.అంతర్జాతీయ ఇంధన సంస్థ ప్రతినిధి మైకేల్ఓపెర్‌మాన్..ఏపీ గృహనిర్మాణ పథకాన్ని అతిపెద్ద గృహనిర్మాణ కార్యక్రమంఅని ప్రశంసించిన విషయాన్ని ఏపీఎస్ఈసీఎంసీఈవో గుర్తుచేశారు. ఈ పథకం ద్వారా 2.5 లక్షల ఉపాధి అవకాశాలను సృష్టించే అవకాశం ఉందని కూడా ఆయన అన్నారని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *