Breaking News

స్వచ్ఛతాహి సేవా ద్వారా గ్రామాలలో పరిశుభ్రత ప్రచార కార్యక్రమాలను జయప్రదం చేయండి…

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
కేంద్ర జలశక్తి మిషన్‌ సూచనల మేరకు స్వచ్ఛతాహి సేవా ద్వారా గ్రామాలలో చేపట్టిన పరిశుభ్రత ప్రచార కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను అధికారులు ఉద్యోగులు పాల్గొన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు కోరారు. స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో శుక్రవారం నున్న గ్రామంలో చేపట్టిన పరిశుభ్రత ప్రచార ర్యాలీని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రామీణ ప్రజలలో పరిశుభ్రత పారిశుద్ద్యంపై అవగాహన కల్పించి ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు కేంద్ర జలశక్తి మిషన్‌ సూచనల మేరకు పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో గ్రామాలలో పరిశుభ్రత ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. సెప్టెంబరు 15వ తేది నుండి అక్టోబరు 2వ తేది వరకు పరిశుభ్రత ప్రచార కార్యక్రమాలలో స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామ సచివాలయ సిబ్బంది గ్రామ పంచాయతీ వాలంటీర్లు స్వయం శక్తి సంఘ సభ్యులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గ్రామ పెద్దలు పారిశుద్ద్య సిబ్బంది పాల్గొన్ని విజయవంతం చేయాలన్నారు. 16వ తేదిన ప్రజాప్రతినిధులు డ్వాక్రా సభ్యులతో విద్యార్థిని విద్యార్థులతో ర్యాలీల నిర్వహణ 17వ తేదిన గ్రామ పంచాయతీ పరిధిలో ఉద్యోగులు క్షేత్రస్థాయి పర్యటన 19న రోడ్డు శుభ్రపరచుట చెత్తకుప్పల తొలగింపు, 20న బయట చెత్త వేయమని ప్రజల నుండి ప్రతిజ్ఞా పత్రాల సేకరణ, 21న పారిశుద్ద్య పరికరాల పరిశుభ్రత 22న ఎస్‌డబ్ల్యుపిసిల పనితీరు పరిశీలన మౌలిక సదుపాయల కల్పన 23న క్లాప్‌ మిత్రాలకు చెత్త సేకరణ వర్మి కంపోష్ట్‌ పై అవగాహన 26న మంచినీటి వనరుల పరిసరాల పరిశుభ్రత 27న ప్లాస్టిక్‌ వ్యర్థాల వినియోగంపై అవగాహన ప్లాస్టిక్‌ నిర్మూలనపై విస్తృత ప్రచారం 28న గ్రామాలలో డ్వాక్రా సభ్యులు స్వచ్ఛంద సంస్థ సభ్యులు విద్యార్థులతో ప్లాస్టిక్‌ వ్యర్థాల సేకరణ 29న పాఠశాలలో కళాశాలలో స్వచ్చతాహి సేవా కార్యక్రమాలపై డిబేట్‌ క్విజ్‌ వ్యాస రచన పోటీల నిర్వహణ సెప్టెంబర్‌ 30,అక్టోబర్‌ 1వ తేదిన పారిశుద్ద్య నిర్వహనలో స్థానికుల భాగస్వామ్యంపై ప్రణాళిక రూపొందించడం అక్టోబర్‌ 2వ తేదిన స్వచ్ఛతాహి సేవా పై గ్రామ సభ నిర్వహించి ప్రణాళికను అమోదించుట, స్వచ్ఛతాహిలో సేవలందించిన వారిని సత్కరించడం జరుగుతుందని కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారిణి జె. సునీత, యంపిపి సిహెచ్‌ ప్రసన్నకుమారి, జడ్పిటిసి ఎస్‌ సువర్ణ రాజు సర్ఫంచ్‌ కె సరళ, వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ వై నాగిరెడ్డి, యంపిడివో బి. భార్గవి తహాశీల్థార్‌ శ్రీనివాస్‌ నాయక్‌, స్థానిక నాయుకులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *