Breaking News

ఏపీ సమాచార ముఖ్య కమిషనర్ గా భాషా…. కమిషనర్ గా శామ్యూల్


-జర్నలిస్టుల హర్షాతిరేకం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
ఏపీ సమాచార ముఖ్య కమిషనర్ గా, కమిషనర్ గా సీనియర్ జర్నలిస్టులు నియమితులయ్యారు. ప్రధాన కమిషనర్ గా ఆర్ మహబూబ్ బాషా, కమిషనర్ గా శామ్యూల్ జనాధన్ ల పేర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించగా… రాత్రి సమయంలో రాష్ట్ర గవర్నర్ ఆమోదించినట్లు విశ్వసనీయంగా తెలియ వచ్చింది. ఇక కడప జిల్లాకు చెందిన భాషా తొలుత ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, వార్తా ఆపై ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలలో వివిధ ప్రాంతాల్లో, వివిధ హోదాల్లో విలేఖరిగా పని చేయగా… పొన్నూరు కు చెందిన శ్యామ్యూల్ గడిచిన 20 ఏళ్లుగా జర్నలిజంలో అనేక ప్రతిష్టాత్మక అవార్డులు పొంది ప్రస్తుతం గుంటూరులో హిందూ పత్రికకు బ్యూరో గా పనిచేస్తున్నారు. వీరిరువురి నియామకం పట్ల విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *