Breaking News

డా. వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్థవంతంగా అమలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా డా. వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తున్నామని  రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎమ్ టి. కృష్ణ బాబు అన్నారు.  విజయవాడ మురళీ ఫార్చ్యూన్ హోటల్ లో డా. వై.ఎస్.ఆర్. ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించి వర్క్ షాప్ ను మంగళవారం  శ్రీ కృష్ణ బాబు ప్రారంభించారు.  ఈ సందర్భంగా కృష్ణ బాబు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పధకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి వైద్య విధానాల  సంఖ్య పెంచడం, ఆరోగ్య శ్రీ బిల్లింగ్ సిస్టం, పే మెంట్ సిస్టం విధానాల్లో అవసరమైన మార్పులు తీసుకురావడం, 1000 రూపాయలు దాటిన ప్రతీ కేసు ను ఆరోగ్యశ్రీ పధకంలో అమలు చేసేలా చర్యలు తీసుకోవడం వంటి చర్యలపై ఈ వర్క్ షాప్ లో చర్చించి నివేదిక రూపొందిస్తారని అయన అన్నారు.  అక్టోబర్ 2 తేదీ నుండి అవసరమైన చేర్పులు మార్పులతో ఆరోగ్యశ్రీ పధకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలనీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నామన్నారు.  ఆరోగ్యశ్రీ పధకంలో మొత్తం 2446 ప్రొసీజర్లు అమలు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పధకంలో 1900 ప్రొసీజర్లు అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. 24 స్పెషలిస్ట్ వైద్య విధానాలకు సంబంధించి ప్రభుత్వ స్పెషలిస్ట్ డాక్టర్లు 85 మంది, ప్రైవేట్ స్పెషలిస్ట్ డాక్టర్లు 24 మంది మొత్తం 109 మంది ఈ వర్క్ షాప్ లో పాల్గొని అమలు జరుగుతున్న ప్రొసీజర్లు కు సంబంధించి నివేదిక ఇస్తారన్నారు.    కేంద్ర ప్రభుత్వ వైద్య పథకాలతో పాటు ప్రక్క రాష్ట్రాలలో అమలు జరుగుతున్నా వైద్య విధానాలను కూడా చర్చించి నివేదికలు రూపొందిస్తారని ఎమ్ టి. కృష్ణ బాబు తెలిపారు.         ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లు ఇంకా అదనంగా జత చేయవల్సిన అవసరం ఉన్నదా, ప్రొసీజర్ ధరలలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం గురించి ఈ సదస్సులో చర్చిస్తారని అయన అన్నారు.   ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ ఆయుష్మాన్ భారత్ ప్రొసీ జర్స్ మధ్య ఉన్న తేడాలను పరిశీలిస్తున్నామని అవసరమైన చర్యలు చేపట్టేలా ఈ వర్క్ షాప్ లో చర్చించడం జరుగుతుందన్నారు.  ప్రత్యేక వైద్య నిపుణులు పాల్గొన్న ఈ వర్క్ షాప్ లో ప్రతీ విభాగానికి నలుగురితో ఒక కమిటీ ని ఏర్పాటు చేశామని ఆ కమిటీలో ఇద్దరు ప్రభుత్వ వైద్యులు, ఇద్దరు ప్రైవేట్ వైద్యులు ఉంటారని అయన తెలిపారు.  ఈ కమిటీ అన్ని కోణాలలో అధ్యనం చేసి ఆసుపత్రిలో ఆమోదయోగ్యమైన ధరలను నిర్ణయిస్తారని అయన తెలిపారు.

ప్రతీ పేదవాని ఆరోగ్యానికి భరోసా కల్పించే విధంగా ఆరోగ్యశ్రీ పధకాన్ని పునః సమీక్షించి మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ వర్క్ షాప్ ఎంతగానో దోహద పడుతుందని అయన అన్నారు.  ప్రతీ గ్రామ సచివాలయ పరిధిలో మొబైల్ మెడికల్  యూనిట్ రెండుసార్లు పర్యటించి మెడికల్ క్యాంప్  నిర్వహించి ప్రజలకు అవసరమైన వైద్య సహాయాన్ని అందిస్తున్నారన్నారు.  గ్రామాలలో షుగర్, బి.పి., హార్ట్ డిసీజెస్ మొదలగు వ్యాధులకు సంబందించిన వైద్య సహాయంతో పాటు మందులు అందించే విధంగా మొబైల్ యూనిట్ లలో డాక్టర్ లు, సిబ్బంది పనిచేస్తున్నారన్నారు.   ప్రతీ గ్రామా సచివాలయ పరిధిలో ఒక ఏ ఎన్ ఎమ్, విలేజ్ మెడికల్ ఆఫీసర్ ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన వైద్య సమాచారాన్ని అందించుటతో పాటు రిఫరల్ హాస్పిటల్స్ సమాచారాన్ని కూడా ప్రజలకు అందిస్తారని అయన తెలిపారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి డా. వై.ఎస్.ఆర్. ఆరోగ్య శ్రీ పధకాన్ని ప్రతీ పేదవాడికి మరింత చేరువ అయ్యేలా అన్ని చర్యలు తీసుకున్నారని అయన తెలిపారు.  ముఖ్యమంత్రి అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా గ్రామ ప్రజలకు సత్వర వైద్య సహాయం అందేలా మొబైల్ మెడికల్ యూనిట్స్ తో పాటు టెలి మెడిసిన్ ను అందుబాటులోనికి తీసుకు వచ్చామని  ప్రిన్సిపల్ సెక్రటరీ ఎమ్ టి. కృష్ణ బాబు అన్నారు.  ఈ సమావేశంలో డా. వై.ఎస్.ఆర్. ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సి.ఈ.ఓ. ఎమ్ ఎన్ హరీంద్ర ప్రసాద్, ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లు, డా. వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *