Breaking News

ఎంపీ భరత్ సమక్షంలో వైసీపీలో చేరిన కాంగ్రెస్ శ్రేణులు

-కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత
– ట్రేడ్ యూనియన్ కు ప్రత్యేక భవనం : ఎంపీ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
అన్ని రంగాల కార్మికుల సంక్షేమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇప్పటికే కార్మికులను ఆర్థికంగా సీఎం జగనన్న ఆదుకుంటున్నారని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. ఆదివారం స్థానిక ఆంంద్ రీజన్సీ హోటల్ పందిరి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ట్రేడ్ యూనియన్ నేత ఎన్వీ శ్రీనివాసరావు, ఆయన అనుచర వర్గం, వివిధ రంగాలకు చెందిన కార్మికులు వందలాదిగా వైసీపీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ఎంపీ భరత్, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ భరత్ ముఖ్యోపన్యాసం చేశారు. కార్మికుల కష్టనష్టాలను చర్చించుకునేందుకు, వారి సమస్యలు పరిష్కార దిశగా కృషిచేసుకునేందుకు ఒక వేదిక అవసరమన్నారు. అటువంటి వేదిక జగనన్న నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం కార్మిక సంక్షేమానికి ఏ మాత్రం కృషి చేయలేదని, అన్ని రంగాలనూ నిర్వీర్యం చేసిందన్నారు. కానీ వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే అద్భుతమైన నవరత్నాలు పథకాలతో వివిధ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని చెప్పారు. ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ.15వేలు ఆర్థిక సహాయం అందజేస్తున్నారని తెలిపారు. మరెన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి జగనన్న సిద్ధంగా ఉన్నారని, ప్రజలందరి సంపూర్ణ ఆశీస్సులు జగనన్నకు ఇవ్వాలని కోరారు. కార్మికులకు ఏ కష్టం వచ్చినా, సమస్య వచ్చినా అర్థరాత్రి అయినా నేను వస్తానని, మీ శ్రేయస్సే నాకు ముఖ్యమని ఎంపీ భరత్ కార్మికుల హర్షధ్వానాలు, కరతాళ ధ్వనుల మధ్య పేర్కొన్నారు. అన్ని రంగాల కార్మికులకు ఒక గొడుగు ఉండాలని, ట్రేడ్ యూనియన్ భవనాన్ని నిర్మిస్తామని ఈ సందర్భంగా ఎంపీ భరత్ ప్రకటించారు. ఒక్కో విభాగానికి ప్రత్యేక క్యాబిన్, ఉమ్మడి వేదిక ఉండేలా విశాలమైన ట్రేడ్ యూనియన్ భవనం తప్పక అవసరమని ఎంపీ భరత్ అన్నారు. అందుకు తగిన భవన నిర్మాణాన్ని నిర్మించేందుకు కృషిచేస్తానని ఎంపీ భరత్ హామీ ఇచ్చారు. జగనన్న చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా వైసీపీలో ఐఎన్టీయూసీ నేతలు, సభ్యులు, పలు రంగాలకు చెందిన కార్మికులు వైసీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు.
రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాస్ చంద్రబోస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ట్రేడ్ యూనియన్ నేతలు, కార్మికులు వైసీపీలో చేరాలని నిర్ణయించుకోవడం మంచి ఆలోచన అన్నారు. కార్మికుల ఉన్నతి కోసం, వారు ఆర్థికంగా చైతన్యవంతులు కావడానికి సీఎం జగన్ కృషిచేస్తున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశరావు, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రుడా చైర్ పర్సన్ శ్రీమతి మేడపాటి షర్మిళ రెడ్డి, గాండ్ల తెలికుల కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి సంకిస భవానీ ప్రియ, నగర అధ్యక్షులు నందెపు శ్రీనివాస్, నగర మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, పేపర్ మిల్ ట్రేడ్ యూనియన్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ చౌదరి, ఇన్నమూరి సాయి దీపు, గుర్రం గౌతమ్, అడపా శ్రీహరి, వివిధ విభాగాల కార్పొరేషన్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ సెల్స్ అధ్యక్షులు, వార్డ్ ఇంచార్జిలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ట్రేడ్ యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *