విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విచ్చేయు భక్తులకు ఉచిత వైద్య శిబిరం మరియు ఉచిత మందులు పంపిణీ ఆదివారం సాయంత్రం కనకదుర్గ నగర్ అర్జున్ వీధి నందు లైన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మెడిక ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం మరియు ఉచిత మందులు పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిధి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు చేతులమీదుగా వైద్య శిబిరం ప్రారంభించబడినది. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ లైన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ మెడికల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఉచిత మందులు పంపిణీ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని దసరా ఉత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకు ఎటువంటి అనారోగ్య ఇబ్బందులు కలగకుండా ఈ వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేస్తారని ప్రతి సంవత్సరం శరన్నవరాత్రులకు లైన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఉచిత శిబిరం ఏర్పాటు చేసి భక్తులకు వైద్య పరీక్షలు,ఉచిత మందులు అందిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ డిస్టిక్ గవర్నర్ దామెర్ల శ్రీ శాంతి మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరం మరియు ఉచిత మందులు పంపిణీ కార్యక్రమం దసరా శరన్నవరాత్రుల సందర్భంగా 10రోజులు ,24 గంటలు కొనసాగుతాయని యాత్రికులు ఎటువంటి అనారోగ్య ఇబ్బందులు పడకుండా వైద్య సహాయం అందుతుందని ఆమె అన్నారు. విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు కొనకళ్ళ విద్యాధరరావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని దసరా శరన్నవరాత్రులు వచ్చే భక్తులకు వైద్య సహాయం ఉచిత శిబిరం నుండి ఉచిత మందులు పంపిణీ చేస్తారని అన్నారు . ప్రతిరోజుఉదయం 8గంటల కుఉచిత ప్రసాదం పంపిణీ జరుగుతుందని అన్నారు. దసరా శరన్నవరాత్రులు సందర్భంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడు చాలా సంతోషకరమని అన్నారుఈ కార్యక్రమంలో ప్రధమ వైస్ డిస్టిక్ గవర్నర్ శంకర్ గుప్తా ద్వితీయ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శేషగిరి ప్రొఫెసర్ నిమ్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కోలా విజయ శేఖర్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వల్లపోతు మురళి కృష్ణ, వై గాంధీ ,పి ప్రభాకర్ ,శ్రీరం శివానందమూర్తి , బెవర సూర్యనారాయణ ,కనకారావు లయన్స్ క్లబ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …