విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో తన సుదీర్ఘ పాదయాత్ర లో పేదల కష్టాలను స్వయంగా చూసి చలించి అధికారంలోకి రాగానే పేదవారి అభివృద్ధి కొరకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు,వారికి కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో వైయస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ ముఖ్య అతిథిగా జరిగిన తూర్పు నియోజకవర్గంలో 11వ డివిజన్ APIIC కాలనీ నందు,5వ డివిజన్ గంగిరెద్దుల దిబ్బ కొండ ప్రాంతంలో దాదాపు 2కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు వెచ్చించి ఏర్పాటు చేస్తున్న వైయస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ల ప్రారంభోత్స కార్యక్రమంలో అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ రాష్ట్ర వేద్యరంగం అభివృద్ధి కి కృషి చేసిన మహనీయులు స్వర్గీయ వైయస్ రాజశేఖర రెడ్డి అని ఆరోగ్య శ్రీ, 104, 108 ఆయన ఏర్పాటు చేసినవే అని,నేడు ఆయన అడుగుజాడల్లో ఆయన తనయుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంతకుమించి కృషి చేస్తున్నారు అని కొనియాడారు.పేదవారికి కూడా కార్పొరేట్ వైద్యం అందించాలని ఆర్థిక కారణాలతో ఏ ఒక్క పేదవాడు కూడా వైద్యం దూరం కాకుడదు అని ఆరోగ్య శ్రీ పరిధి విస్తరించి ప్రక్క రాష్ట్రాలలో కూడా చికిత్స పొందేలా రూపకల్పన చేసారని,గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం వైద్యులు అందుబాటులో ఉండేలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టీ ఈ వైయస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ల్ ఏర్పాటు చేస్తున్నారు అని తెలిపారు.గత ప్రభుత్వం లో ప్రభుత్వ ఆసుపత్రిలు అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఉండేదని,సమయానికి వైద్యులు అందుబాటులో వుండేవారు కాదని,మందులు కూడా సొంత డబ్బులుతో కొనుకొన్నే దౌర్భాగ్య పరిస్థితులు ఉండేవావని విమర్శించారు. కానీ ఇప్పుడు నాడు నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలు మెరుగుపర్చి కార్పొరేట్ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకరన్ , జిల్లా మెడికల్ ఆఫీసర్ సుహాసిని , నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ , డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ , అవుతూ శైలజా రెడ్డి , 5వ డివిజన్ కార్పొరేటర్ కలపాల అంబేద్కర్ , 11వ డివిజన్ ఇంచార్జ్ పర్వతనేని బాబీ , మరియు వివిధ కార్పొషన్ డైరెక్టర్లు, తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు, ఇంచార్జిలు, వైస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …