Breaking News

కృష్ణా జిల్లాలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేద్దాం… : జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త:
వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు రైతులకు మరింత సుపరిపాలన అందించే విధంగా సభ్యులు కృషి చేయాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి వైస్ చైర్మన్ , కలెక్టర్ పి.రంజిత్ బాషా సూచించారు.
బుధవారం సాయంత్రం కలెక్టర్‌ కార్యాలయంలోని స్పందన సమావేశపు మందిరంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం మండలి చైర్‌పర్సన్‌ జన్ను రాఘవరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా వ్యవసాయ సలహా మండలి కన్వీనర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల, వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ సలహా మండలి వైస్ చైర్మన్, జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా మాట్లాడుతూ, జిల్లాలో వ్యవసాయం, ఉద్యాన పంటలు విస్తీర్ణం 4,41,116 ఎకరాలు, ఈ- క్రాప్ బుకింగ్ ఇప్పటివరకు 4,11,515 ఎకరాల్లో (93%) జరిగిందన్నారు.. ఈ-క్రాప్ బుకింగ్ పూర్తి చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 29. కౌలు రైతులతో సహా రైతులందరికీ ఈ క్రాప్ బుకింగ్ గురించి గ్రామాల్లో విస్తృత ప్రచారం కల్పించినట్లు తెలిపారు. సోషల్ ఆడిట్ కోసం రైతు భరోసా కేంద్రాల వారీగా జాబితాను రూపొందించబడిందన్నారు. జిల్లాలో 390 రైతు భరోసా కేంద్రాల్లో సోషల్ ఆడిట్ అక్టోబర్ 10, 2022 తుది గడువు అని చెప్పారు. ఈ-క్రాప్ డేటా నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ కంపెనీకి భాగస్వామ్యం చేయబడుతుందన్నారు. అలాగే, రైతులు ఈ. కె వై సి అక్టోబర్ 5 వ తేదీ నుండి అక్టోబర్ 10 మధ్యకాలంలో ప్రారంభమవుతుందన్నారు. ఈ-కె వై సి తర్వాత రైతుకు మొబైల్ ఫోనుకు డిజిటల్ సందేశం పంపబడుతుందని, ఈ- కె వై సి తర్వాత రైతులకు ఫిజికల్ అక్నాలెడ్జ్‌మెంట్ జారీ చేయబడుతుందని తెలిపారు.ఎరువుల లభ్యత గురించి వివరించారు. 107034 మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరానికి తగిన విధంగా ఉందన్నారు
ఖరీఫ్ సీజన్ లో ఎరువులు ఇప్పటివరకు జిల్లాకు దాదాపు 1,01,133 మెట్రిక్ టన్నులు అందాయి
64617 మెట్రిక్ టన్నులు విక్రయించబడ్డాయిని, 36516 స్టాక్ నిల్వలు అందుబాటులో ఉన్నాయిన్నారు. వ్యవసాయ, ఉద్యాన,పశు సవర్ధక. మత్య్సశాఖ అనుబంధ రంగాలలో మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా లాభదాయకమైన పంటలు పండించే విధంగా రైతులను ప్రోత్సహించడం, నికర వ్యవసాయక ఆదాయాలను పెంచే ఉత్తమ విధానాలపై వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా రైతులకు అవగాహన కల్పించడం, నీటి వనరుల సమర్ధ వినియోగం, వ్యవసాయ ఉత్పత్తలకు ఎగుమతి అవకాశాలకు ఎగుమతి అవకాశాలను విస్తరించడం, వ్యవసాయ ఉత్పత్తుల డిమాండు పెంచడం, ఇతర రైతు సంక్షేమ అంశాలపై చర్చించి రాష్ట్ర మండలి ద్వారా ప్రభుత్వానికి సూచనలు పంపడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ క్రాప్ మరో 15,000 ఎకరాల్లో పెండింగ్ లో ఉందని అధికారులు త్వరితగతిన ఆ లక్ష్యాన్ని కూడా పూర్తి చేయాలన్నారు. ధాన్య సేకరణ విషయంలో సంబంధిత అధికారులు అత్యంత ప్రమాదంగా ఉండాలన్నారు.
అనంతరం మండలి చైర్‌పర్సన్‌ జన్ను రాఘవరావు మాట్లాడుతూ, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రైతుల సమస్యలు, ఇబ్బందులను చర్చించి పరిష్కరించేందుకు మండలి వేదికగా నిలుస్తుందన్నారు. రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్‌ అమలు చేస్తున్న పథకాలు రైతుల్లో నూతన ఉత్సాహం నింపుతున్నాయన్నారు. అనంతరం దాళ్వా పంటలో బొండాల రకం సాగు చేయకుండా రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించడం, వ్యవసాయ పంట కాలువలు, డ్రైనేజీ, కెనాల్స్‌లో పూడికలు తీయడం, పంట కాలువలు, డ్రైనేజీలపై ఆక్రమణల తొలగింపు బోర్ల కింద వరి పంట తగ్గించి రైతులకు అధిక ఆదాయం ఇచ్చే అపరాల సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించడం, జిల్లాలో సాగు చేసే ప్రతి పంట వివరాలు ఈ క్రాప్‌లో నమోదు చేయడం, కౌలు రైతు కార్డు కలిగిన రైతులకు పంట రుణాల మంజూరు, ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం ద్వారా ఉద్యాన పంటలు పండించే రైతులకు ఉద్యాన పంట పథకాలు వర్తింపచేయడం అంశాలపై చర్చించి తీర్మానించారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్ మనోహర్ రావు , జిల్లా ఉద్యానవన శాఖ అధికారిణి జే. జ్యోతి , పశుసంవర్థకశాఖ జేడీ చంద్రశేఖర రావు , పలువురు ఏడీలు, ఏవోలు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పలువురు రైతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తూర్పు గోదావరి జిల్లా అధికారిక వెబ్సైట్లో ఈ- డిస్ట్రిక్ మేనేజర్’ పోస్టు కు దరఖాస్తు చేసుకున్న అర్హుల తాత్కాలిక జాబితా

-కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న ‘ఈ- డిస్ట్రిక్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *