-జిల్లా కలెక్టర్ డా. కె. మాధవి లత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లా లో 31 పి. హెచ్. సి. లకు గాను జాతీయ నాణ్యత ప్రమాణాలను పాటించిన నందుకుగాను 14 పి. హెచ్.సి లు ఎంపిక అవ్వడం అభినందనీయం అని జిల్లా కలెక్టర్, కమిటీ ఛైర్ పర్శన్ డా. కె. మాధవి లత అన్నారు. బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా క్వాలిటీ అస్సురెన్స్ కమిటీ, జిల్లా కుటుంబ నియంత్రణ నష్టపరిహారం ఉప సంఘం కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ నాణ్యత హామీ ప్రమాణాలు మేరకు ఆగస్ట్ 15 న ప్రకటించిన అవార్డులను కలెక్టర్ అందచేశారు. ఈ సందర్బంగా డా కె.మాధవి లత మాట్లాడుతూ జిల్లా పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పరిశుభ్రత, ఓ. పి. సేవలు, ఐ. పి. సేవలు ఆధారంగా జాతీయ వైద్య ఆరోగ్య విభాగం ద్వారా ప్రతి ఏటా అవార్డుకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఆయా మార్గదర్శకాలు సక్రమంగా ఉండడం వల్ల, లైసెన్స్ లు, రికార్డులు పరిపూర్ణము గా నమోదు చేయడం వల్ల జిల్లా లో 14 పి. హెచ్. సి లు ఎంపిక అవ్వడం జరగడం శుభదాయకం అన్నారు. జాతీయ నాణ్యత హామీ ప్రమాణాలు పాటించి నందుకు గాను ఒక్కొక్కో పి. హెచ్. సి. కి త్వరలో 3 లక్షల రూపాయలు మంజూరు అవుతాయని అన్నారు. జిల్లాలోని ప్రతి ఒక్క పి హెచ్ సి కూడా వొచ్చే ఏడాది ఆ ప్రమాణాలు పాటించి తద్వారా జాతీయ నాణ్యత హామీ ప్రమాణాలు మేరకు అందచేసే పురస్కారం అందుకుని ఆయా ఆసుపత్రుల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోగ్య సేవకు సంబంధించి నాడు నేడు పనుల లక్ష్యాలను సద్వినియోగం పరుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో కన్వీనర్ డా. ఎన్. వసుంధర, మెంబెర్ సెక్రట రీ డా. ఎస్. జ్యోతి కుమారి, డి. సి. హే. హెచ్. ఎస్., డా. యం. సనత్ కుమారి, మెంబెర్స్ పాల్గొన్నారు.