Breaking News

భక్తులకు అధికారులు చేసిన ఏర్పాట్లు బాగున్నాయి… : మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి

ఇంద్ర‌కీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త:
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నపూర్ణదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మఅమ్మవారిని గురువారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, ఇంధన, సైన్స్ అండ్ టెక్నాలజీ, గనుల శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ ఈవో డి. బ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా అమ్మవారి శేషవస్త్రం, అమ్మవారి చిత్రపటము, ప్రసాదము అంద జేశారు. దర్శనానంతరం మీడియా సెంటర్ లో మంత్రి మాట్లాడుతూ అన్నపూర్ణదేవి అలంకారమంలో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషదాయకం అని అన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని,పాడి పంటలతో తులతూగాలని అమ్మవారిని ప్రార్ధించానన్నారు. భక్తులకు అధికారులు చేసిన ఏర్పాట్లు బాగున్నాయని అన్నారు. మంత్రితో పాటు మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *