విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ 47 వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పొట్నూరు శ్రీనివాసరావు మరియు కొప్పిరెడ్డి సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో సర్వ మత ప్రార్థనలను, రామానాయుడు, చైతన్య, ఏలూరు సాయి శరత్ భారీ యాపిల్ గజమాలతో సత్కరించి వారి కేక్ కటింగ్చేయించినారు వారందరూ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సంపూర్ణ మద్దతు అమ్మవారి ఆశీస్సులతో రాబోయే ఎన్నికల్లో పోతిని మహేష్ పశ్చిమ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి తప్పక వెళ్తారని, పశ్చిమ నియోజకవర్గంలో నిజమైన అభివృద్ధి ఏంటో 2024లో ప్రజలు చూస్తారని ప్రసంగించినారు, అదేవిధంగా వాయిస్ ఆఫ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు శ్యామ్ గారు మహేష్ గారి జన్మదిన వేడుకలకు హాజరై నీలి కండువాతో సత్కరించినారు నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలతో మమేకమవుతున్నందునే మహేష్ తో కలిసి ప్రయాణం చేస్తున్నామన్నారు. జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల నుంచి డివిజన్ అధ్యక్షులు, నగర కమిటీ సభ్యులు, నగర నాయకులు, అమ్మవారి ధార్మిక సేవ మండలి సభ్యులు, లీగల్ సెల్ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఐ టీ వింగ్ సభ్యులు, ప్రోగ్రాం కోఆర్డినేటర్లు, వీర మహిళలు జనసైనికులు మూడు వేలకు పైగా కార్యకర్తలు వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …