-పేదల కుటుంబాల్లో విద్యాదీపం వెలిగించడానికి అమ్మఒడి పధకాన్ని జగనన్న ప్రవేశపెట్టారు
-రాష్ట్రంలో ఆదాయ వనరులు లేకపోయినా ఋణ మాఫి, సున్నా వడ్డీ పధకాలు, వై. ఎస్. ఆర్. చేయూత పధకాలు అమలు చేసాం.
-రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రం లో బాల కార్మిక వ్యవస్థ ఉండకూడదని, పేదల కుటుంబాల్లో విద్యా దీపం వెలిగించడానికి అమ్మవడి పధకాన్ని ముఖ్యమంత్రి జగనన్న ప్రవేశపెట్టడం జరిగిందని రాష్ట్ర హోం మంత్రి డా.తానేటి వనిత అన్నారు. శుక్రవారం యువరాజ్ ఫంక్షన్ హాల్ లో వై ఎస్ ఆర్ చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమం లో హోం మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, మహిళలకు 45 సంవత్సరాలు దాటిన తరువాత బలహీనంగా వుంటారని, పేద కుటుంబాల మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడతారనే ఉద్దేశ్యం తో మన జగనన్న “వై ఎస్ ఆర్ చేయూత” పధక ఆలోచన చెయ్యడం జరిగిందన్నారు. జిల్లాలో 88,356 మందికి 3వ విడత ద్వారా ₹.165.67 కోట్ల మేర వై ఎస్ ఆర్. చేయూత పథకం ద్వారా లబ్ది చేకూరుతొందన్నారు. అన్నీ వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి దృష్టిలో ఉంచుకుని ఆయా పేద, నిరుపేదల కుటుంబాల ఆర్థిక సాధికారత కోసం నవరత్నాలు పధకము లను, గత మూడు సంవత్సరాలుగా వై ఎస్ ఆర్ చేయూత ను అమలు చేయ డం జరుగుతోందని అన్నారు.
“వై ఎస్ ఆర్ చేయూత” ద్వారా స్వయం జీవనోపాధి ని ప్రోత్సహించడం లో భాగంగా రిటైల్ వ్యాపార రంగంలో ఉన్న అర్హులైన పేద నిరుపేద మహిళల కుటుంబాల్లో వెలుగులు నింపడం జరుగుతోందన్నారు. నాలుగు విడ తల్లో ₹.75 వేల ఆర్థిక చేయూత ఇవ్వడం లో భాగంగా రూ.18,750 చొప్పున ఇవ్వడం జరుగుతోందని మంత్రి అన్నారు. ఇందులో భాగంగా మూడు విడతల్లో జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాం తాల లోని 45-60 సంవత్స రాలు మధ్య ఉండే వారికి రూ.165.67 కోట్ల ప్రయోజనం కల్పించ గలిగామన్నా రు. నిర్దుష్టమైన జీవనోపాధి కోసం ఈ మొత్తాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత మూడు సంవత్సరాలుగా ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ మహిళల ఆర్థిక వెనుక బడిన వర్గాల వారికి కుల మత, ప్రాంత, రాజకీయా లకి అతీతంగా అర్హులకుఅందించామన్నారు.
కొవ్వూరు నియోజకవర్గం లో చాగల్లు మండలంలోని 3577 మంది లబ్ధిదారులకు రు.6,71 కోట్లు, కొవ్వూరు మండలంలోని 4833 మంది లబ్ధిదారులకు రు.9.06 కోట్లు, తాళ్లపూడి మండలం లోని 2578 మంది లబ్ధిదారులకు రు.4.83 కోట్లు, వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కుల, మత, పార్టీ భేదం లేకుం డా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, 60 సంవత్సరాలు నిండితే సామాజిక భద్రత పెన్షన్ అంతేకాకుండా చేయూత, కాపు నేస్తం, రైతు భరోసా, పేదలకు ఇళ్ల స్థలాలు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా మన్నారు. మహిళలు ఆయా కుటుంబాలకు రథసారథులని చేయూత పధకం ద్వారా మహిళలకు ఆర్థి క సహాయం తో పాటు జీవనో పాధికి తోడ్పాటు అందిస్తున్నా మని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్. ఛైర్పర్సన్ పోసిన శ్రీలేఖ, మునిసిపల్ ఛైర్పర్సన్, బావన రత్న కుమారి, కోడూరి శివ రా మ కృష్ణ, మునిసిపల్ వైస్ ఛైర్పర్సన్, గండ్రోతు అంజలి దేవీ, జెడ్పిటిసి బొంతా వెంకట లక్ష్మి, టి. వి. రామారావు, యంపిడిఓ, కుమార్, మండల తాహిసీల్దార్ బి. నాగరాజు నాయక్, తాళ్ల పూడి యం. పి. పి., జొన్నకూటి పోసిబాబు, ముదునూరి నాగరాజు, వార్డు కౌన్సిలర్లు వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొ న్నారు.