విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగర పాలక సంస్థకు సంబంధించిన జోనల్ ఆఫీసులలో పట్టాణ ప్రణాళిక సిబ్బంది వారు శుక్రవారం ఫ్రై డే ఓపెన్ ఫోరం /LRS మేళను నిర్వహించినారు. సదరు మేళా 12 మంది ప్రజలు పాల్గొని పట్టాణ ప్రణాళిక శాఖకు సంబంధించి తమ సమస్యలను తెలియచేసి తమ అనుమానములను నివృత్తి చేసుకొనినారు. LRS కి సంబంధించిన పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయడమే ఈ మేళా యొక్క ముఖ్యోద్దేస్యమనియు మరియు ప్రభుత్వము వారు LRSకి సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించే నిమిత్తము 31-10-2022 వరకు మెమో నెం.1426943/MM2/2021, తేది 10-08-2022 ప్రకారము పొడిగించబడినదనియు తెలియచేయటమైనది. కావున సదరు మూడు సర్కిల్స్ లో నిర్వహించిన మేళా నందు ఈ క్రింది అంశములకు గాను హాజరైన ప్రజల వివరములు తెలియజేయటమైనది. మూడు సర్కిల్స్ నందు పై ఓపెన్ ఫోరం /LRS మేళ నందు దాఖలు పరచిన మొత్తం 12 దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించబడుననియు మరియు ప్రతి శుక్రవారం ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 వరకు మూడు సర్కిళ్ల నందు ఓపెన్ ఫోరం / LRS మేళాలు నిర్వహించబడునని అందరు లైసెన్సెడ్ సర్వేయర్ / లైసెన్సెడ్ టెక్నికల్ పర్సన్ /ఇంజనీర్ లకు మరియు ప్రజలకు తెలియచేయడమైనది. అంతే కాక సమస్యల పరిష్కరించు కొనుటకు గాను 3 సర్కిల్స్ నందు గల పట్టాణ ప్రణాళిక విభాగమునకు సంబంధించిన టి. పి. బి. ఒ / టి. పి. ఎస్ / టి. పి. ఒ లు మరియు అసిస్టెంట్ సిటి ప్లానర్లు, డిప్యూటీ సిటీ ప్లానర్ల ద్వారా నిర్వహించబడునని తెలియజేయడమైనది.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …