గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
న్యూడిల్లీలోని స్వచ్చ భారత్ మిషన్ ఆజాదీ @75 స్వచ్చ సర్వేక్షణ్-2022 ర్యాంకులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారని, అందులో గుంటూరు నగరపాలక సంస్థ రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు, జాతీయ స్థాయిలో 108వ ర్యాంకు సాధించిందని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూజాతీయ స్థాయిలో స్వచ సర్వేక్షణ్ ర్యాంకులను కేంద్ర ప్రభుత్వం 2016 నుండి పారిశుధ్యం, ఇంటింటి చెత్త సేకరణ, వ్యర్ధాల తడి పొడి విభజన, వ్యర్ధాల నిర్వహణ, నగర పరిశుభ్రం పై ప్రజల అభిప్రాయలు పరిగణలోకి తీసుకొని జాతీయ, రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు కేటాయిస్తుందని తెలిపారు. 2016న ప్రారంభం అయిన స్వచ్చ సర్వేక్షణ్ పోటీల్లో గుంటూరు నగరపాలక సంస్థ పాల్గొంటుందని పేర్కొన్నారు. నగరంలో పారిశుధ్య విభాగంలో ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గతేడాది జాతీయ స్థాయిలో 130, రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించామన్నారు. స్వచ్చ సర్వేక్షణ్-2022లో రాష్ట్ర స్థాయిలో 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో 7వ ర్యాంకు, జాతీయ స్థాయిలో 108వ ర్యాంకు సాధించిడం జరిగిందని తెలిపారు. నగరంలో ఇంటింటి చెత్త సేకరణకు ప్రతి ఇంటికి ఆర్.యఫ్.ఐ.డి. ట్యాగ్ ల ఏర్పాటు, సచివాలయం వారీగా క్లస్టర్ల ఏర్పాటు చేశామన్నారు. హోం కంపోస్ట్, వ్యర్ధాల తడి పొడి విభజన పై ప్రజలకు అవగాహన, ప్రోత్సహక కార్యక్రమాలు ప్రత్యేకంగా చేపడుతున్నామని తెలిపారు. ఇంటింటికి తడి, పొడి, ప్రమాదకర వ్యర్ధాలు వేరుగా సేకరించడానికి 3 రకాల డస్ట్ బిన్లను పంపిణీ చేశామని, త్వరలో ఇంటింటి చెత్త సేకరణకు 220 ఈ.ఆటోలు కూడా అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. రానున్న కాలంలో గుంటూరు నగరాన్ని ప్రజల సహకారంతో స్వచ్చ గుంటూరుగా మార్చుకుంటూ స్వచ్చ సర్వేక్షణ్ లో మరింత మెరుగైన ర్యాంక్ సాధనకు కృషి చేస్తామని తెలిపారు.
Tags guntur
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …