Breaking News

నాస్తిక కేంద్రంలో శాశ్వత ‘‘బాపు దర్శన్‌’’ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
గాంధీజీ భోధించిన సత్యం, అహింసా మార్గాలే శాంతికి బలమైన సిద్ధాంతాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. నగరంలోని బెంజ్‌సర్కిల్‌ నాస్తిక కేంద్రంలో ఆదివారం ఆదునీకరించిన బాపు దర్శన్‌ను కలెక్టర్‌ డిల్లీరావు ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతీ వ్యక్తికి ఆత్మగౌరవం, గుర్తింపు ఉండాలని మానవులంతా ఇక్కటే అనేది గాంధీ సిద్ధాంతం అని అన్నారు. కుల, మత, ద్వేషాలు ఏ మాత్రం పనికి రావాని గాంధీజీ ఉద్బోధించేవారన్నారు. భారతీయులంతా సోదరులే అనే భావంతో అందరూ మెలగాలని గాంధీజీ సందేశం మన దేశానికి శ్రీరామ రక్ష అన్నారు. గాంధీజీ బోధించిన మత సామరస్యం, అసృశ్యతనిర్మూలన, గ్రామ పారిశుద్యం, గ్రామీణ పరిశ్రమలు, ఆర్థిక సమానత్వం, రైతు వికాసం, కార్మిక సంఘాలు, ఆదివాసుల వికాసం దేశ నిర్మాణంలో విద్యార్థుల భాగస్వామ్యం వంటి సందేశాలు ఎల్లప్పటికి మనకి మార్గదర్శకాలన్నారు. బాపుదర్శన్‌లో ఏర్పాటు చేసిన చాయ చిత్రాలు ఎన్నో విషయాలు కళ్ళకు కట్టినట్లు ఉన్నాయన్నారు. జిల్లాలోని హైస్కూళ్ళు, కాలేజి విద్యార్థులు తప్పనిసరిగా బాపు దర్శన్‌ను సందర్శించి చైతన్యవంతులై దేశ నిర్మాణలో భాగస్వాములు కావాలన్నారు. దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ద వహించాలని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు. కార్యక్రమంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సోసైటీ జిల్లా చైర్మన్‌ డా. సమరం, చెన్నుపాటి వజీర్‌, సిద్దార్థ ఫార్మశి కాలేజి ప్రిన్సిపల్‌ డా. సునీత, లక్ష్మి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం – నిర్మాణరంగాన్ని నిలబెడతాం

-అందుకోసమే ఉచిత ఇసుక పాలసీ -రియల్‌ ఎస్టేట్ బాగున్న చోటే సంపద సృష్టి -గత ప్రభుత్వంలో నిర్మాణరంగం అడ్రస్ లేదు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *