రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ఎన్నికల సంఘం వారి ఆదేశముల మేరకు అందరూ బూత్ లెవెల్ అధికారులచే 9.9.2022 (ఆదివారం) న అన్ని పోలింగ్ కేంద్రాలలో 6 బి ఫారాలు స్వీకరించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు తేదీన బూత్ లెవల్ అధికారులు పోలింగ్ కేంద్రాల నందు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటలు వరకు అందుబాటు లో ఉండి, ఓటర్ల వద్ద నుండి ఆధార్ సమాచారం ఫారం 6Bనందు స్వీకరించడం జరుగుతున్న దృష్ట్యా ఇప్పటి వరకు ” 6 బి ” అంద చెయ్యని ఓటర్లు పోలింగ్ కేంద్రాల కు స్వయంగా వచ్చి తమ ఆధార్ డేటాను ఎన్నికల డేటాతో లింక్ చేయడానికి వివరాలు సమర్పించ వలసినదిగా కోరడమైనది. జిల్లాలోని 1570 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 6 బి ఫారం నమోదు చేయడం జరుగుతుందని కలెక్టర్ మాధవీలత తెలిపారు. జిల్లాలోని మొత్తం 15,40,455 మంది ఓటర్లలో 9,16,109 (59.47%) మంది కి చెందిన ఓటర్ కార్డులను ఆధార్ తో అనుసంధానం చేయడం జరిగిందన్నారు.
15 వ ఆర్థిక సంఘం నిధుల విడుదల:
జిల్లా పరిధిలోని 279 గ్రామ పంచాయతీ లకు 15 వ ఆర్థిక సంఘం నిధులు 2020-21 వ ఆర్థిక సంవత్సరానికి గాను రెండో విడతగా రూ 8.64 కోట్లు మేర గ్రాంట్ విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ మాధవీలత తెలిపారు. ఈ మొత్తాన్ని ఆయా గ్రామ పంచాయతీ లకు విడుదల చేయాలని జిల్లా పంచాయతీ అధికారి కి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వము నిర్దేశించిన మార్గ దర్శకాలు మేరకు ఆ మొత్తాన్ని ఖర్చు చేయవలసినదిగా పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.