విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సబ్ కలెక్టర్‌గా సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించిన 2020 ఐఏఎస్‌బ్యాచ్‌కు చెందిన ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీమతి అదితి సింగ్‌ను విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో పలువురు అధికారులు సిబ్బంది కలిసి అభినందనలు తెలియజేశారు. జిల్లా పౌర సంబంధాల అధికారి ఎస్ వి. మోహన్‌రావు, విజయవాడ సెంట్రల్ ఉత్తర మండల రూరల్ మండల తహాశీల్థార్లు వెన్నెల శ్రీను, దుర్గాప్రసాద్, శ్రీనివాస్ నాయక్, సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి శ్రీనివాస్‌రెడ్డి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, విలేజ్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది, సబ్ కలెక్టర్‌ను కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అదితి సింగ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హత కలిగిన ప్రతి లబ్దిదారునికి చేరువచేసేందుకు సమన్వయంతో ప్రతి ఒక్కరూ పారదర్శకతతో పని చేయాలని సూచించారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …