విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని కలెక్టరేట్ కాంపౌండ్‌లో ఆదునీకరించిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్‌ను సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ ప్రారంభించారు. ప్రభుత్వానికి ఐటి సేవలను అందించడం, డిజిటల్ ఇండియ కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరమైన మౌలిక సదుపాయలను కల్పించడం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ప్రధాన బాధ్యత. దీనిలో భాగంగా ప్రతి జిల్లాలోను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ద్వారా జిల్లాకు చెందిన వెబ్ సైట్‌ను నిర్వహించడం వివిధ శాఖలలో ఈ`ఆఫీస్ సేవలు, సాంకేతిక పరంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవలను అందించడం, సాంకేతిక పరమైన సమస్యలను పరిష్కరించడంలో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ద్వారా శాఖలు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో డిఆర్వో కె. మోహన్‌కుమార్, పంచాయతీరాజ్ ఇఇ అక్కినేని వెంకటేశ్వరరావు, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్సు కె. సూర్యారావు, కలెక్టరేట్ ఏవో ఇంతియాజ్ పాషా ఉన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …