-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ నిధులతో చేపటిన పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ తొలి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సోమవారం నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకలకు అనుగుణంగా డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ నిధులలో 55 శాతం ప్రాధాన్యత రంగాలైన త్రాగునీటి సరఫరా, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ఆరోగ్య సంరక్షణ, విద్య, మహిళాభివృద్ధి శిశు సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, శానిటేషన్, కార్మికుల సంక్షేమానికి వినియోగించవలసి ఉంటుందన్నారు. 40 శాతం నిధులను భవనాలు, రోడ్డు, బ్రిడ్జిలు, ప్రాజెక్టు అభివృద్ధికి ఖర్చు చేయవచ్చునన్నారు. మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించే 10 కిలో మిటర్ల లోపు ప్రాంతాన్ని తీవ్ర ప్రభావిత ప్రాంతంగాను, 25 కిలో మిటర్ల ప్రాంతాన్ని సాధారణ ప్రభావిత ప్రాంతంగాను గుర్తించడం జరిగిందన్నారు. డిస్ట్రిక్ట్ మినరల్ ట్రస్ట్ నిధులను ఖర్చు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (డియంఎఫ్) కౌన్సిల్ సమావేశంలో ఆమెదం తీసుకోవాల్సి వుంటుంది. జిల్లాలోని వివిధ క్వారీల నుండి సుమారు 273 కోట్ల రూపాయల డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్‌ను వసూలు చేయడం జరిగిందన్నారు. ఈ నిధులలో గతంలో 2 కోట్ల రూపాయల వరకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా పనులకు, 25 కోట్ల రూపాయలు కోవిడ్ నియంత్రణకు, మరో 20 కోట్ల రూపాయలను వివిధ పనులు నిర్వర్తించిన కాంట్రాక్టర్లకు చెల్లించగా ప్రస్తుతం ఎన్‌టిఆర్ జిల్లాలో సుమారు 130 కోట్ల రూపాయల నిధులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ నిధులలో 80 కోట్ల రూపాయలను పాలనపరమైన పనులకు విడుదల చేయడం జరిగిందన్నారు. మరో 2.33 కోట్ల రూపాయల పెండిరగ్ బిల్లులకు సంబంధించి సిఎఫ్‌యంఎస్ ద్వారా బిల్లులను చెల్లించవలసి వుంటుందన్నారు. మరో 1 కోటి రూపాయల వరకు బిల్లులను చెల్లించవలసి ఉందన్నారు. మరో 76 కోట్ల రూపాయలకు సంబంధించిన వివిధ పనులు పురోగతిలో ఉన్నాయని ,ఇందుకు సంబంధించిన పనులకు నిధులు చెల్లించవలసి ఉందన్నారు. మొత్తం నిధులలో ఖర్చులు పోను 50.50 కోట్ల రూపాయల నిధులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇందులో జగ్గయ్యపేట నియోజకవర్గంలో 34.93 కోట్ల రూపాయలు, నందిగామ నియోజకవర్గంలో 9.59 కోట్ల రూపాయలు, మైలవరం నియోజకవర్గంలో 21.96 కోట్ల రూపాయలు, తిరువూరు నియోజకవర్గంలో 1.39 కోట్ల రూపాయలు, విజయవాడ నియోజకవర్గంలో 3.08 కోట్ల రూపాయల ప్రతిపాదిత పనులకు అంచనాలను రూపొందించడం జరిగిందన్నారు. కౌన్సిల్ సమావేశాన్ని ప్రతి నెల నిర్వహించి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్‌ను ప్రాధాన్యత రంగాలకు వినియోగించేలా అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేసి సంక్షిప్త సమాచారంతో తదుపరి కౌన్సిల్ సమావేశంలో ఉంచాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు పంచాయితీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
సమావేశంలో శాసనసభ్యులు సామినేని ఉదయభాను మాట్లాడుతూ డియంఎఫ్‌టి నిధుల వినియోగంపై కౌన్సిల్ సమావేశం నిర్వహించడం పట్ల జిల్లా కలెక్టర్‌కు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. డియంఎఫ్ నిధులతో ఇప్పటి వరకు చేపట్టిన పనులను పూర్తి చేయడంలో సచివాలయ ఇంజనీరింగ్ సిబ్బంది సేవలను కూడా వినియోగంచుకుని పనులను వేగవంతం చేయాలని సూచించారు. నీటి అవసరాల కొరకు జిల్లా వ్యాప్తంగా వందలాది బోర్లు వేయడం జరిగిందని అయితే వాటిపై సరైన పర్యవేక్షణ లేక వేసిన బోర్లులో దాదాపు సాగానికి పైగా పనిచేయడం లేదని దీనిపై ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి బోర్ల మరమత్తులకు చర్యలు తీసుకుని వినియోగంలోనికి తీసుకురావాలన్నారు.
శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్ మాట్లాడుతూ జిల్లాలో 56 ఇసుక రీచ్‌లకు గాను 30 రీచ్‌లు మాత్రమే పనిచేస్తున్నాయని ఇసుక రీచ్‌లను ప్రారంభించేలా చర్యలు తీసుకుని సామాన్యులకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ముఖ్యంగా నగరపాలక సంస్థ పరిధిలో ఇసుక లభ్యత లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొవలిసి వస్తుందని దీనివలస నాడు`నేడు, జగనన్న గృహ నిర్మాణ పనులలో జాప్యం ఏర్పడుతుందన్నారు. ఇకపై ప్రతి నెల మండల స్థాయి అధికారులతో మైనింగ్ అధికారులు సమావేశం నిర్వహించి ఇసుక కొరత సమస్యను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
సమావేశంలో డిసిసిబి చైర్మన్ టి. నాగేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, మైనింగ్ డిప్యూటి డైరెక్టర్ కె. సుబ్రమణేశ్వరరావు, ఏడిలు బి రవికాంత్, బి రామచంద్ర, పంచాయతీరాజ్ ఇఇ ఏ వెంకటేశ్వరరావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌సి యం.వి. ఎస్‌ఎస్ రాజు, ఇరిగేషన్ ఎస్‌ఇ ఎస్.తిరుమలరావు, ఇఇ పివిఆర్ కృష్ణారావు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.