-జగనన్న కాలనీలలో సామూహిక గృహప్రవేశాలకు నిర్మాణాలను చేయండి..
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డిసెంబర్ 21న జిల్లాకు చెందిన జగనన్న కాలనీలలో సుమారు 5790 సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం నిర్వహించనున్నామని ఇందుకు సంబంధించి గృహ నిర్మాణాలు పూర్తి చేసి సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
జగనన్న కాలనీల గృహ నిర్మాణాలు, నాడు`నేడు పనుల ప్రగతి, గ్రామ వార్డు సచివాలయ నిర్మాణాలు, స్పందన గ్రీవెన్స్ తదితర అంశాలపై బుధవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లాకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడివోలు, తాశీల్థార్లు, పంచాయతీరాజ్. హౌసింగ్ ఇఇలు, డిఇలు, ఏఇలతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న కాలనీలలో గృహ నిర్మాణాల పనులను త్వరితగతిన పూర్తి చేసి డిసెంబర్ 21వ తేదీన సామూహిక గృహ ప్రవేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. పెద్ద ఎత్తున నిర్వహించే సామూహిక గృహప్రవేశాల కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు ఉన్నత అధికారులు హాజరై గృహ ప్రవేశాలు నిర్వహించి సొంత ఇంటి కల నేరవేర్చుకున్న లబ్దిదారులతో ఆనందాన్ని పంచుకోనున్నారన్నారు. స్పెషల్ ఆఫీసర్లు హౌసింగ్ అధికారులు మండల స్థాయి అధికారులు సంయుక్తంగా గృహ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిరంతర పర్యవేక్షణతో పనులను మరింత వేగవంతం చేసిన్నప్పుడే సామూహిక గృహ నిర్మాణాల కార్యక్రమాన్ని విజయవంతం చేయగలుగుతామన్నారు. నిరుపేదలకు సొంత ఇంటి కల నేరవేచే కార్యక్రమాన్ని మహాయజ్ఞంలా చేపట్టి నిర్మాణాల ప్రగతిలో జిల్లాను అగ్రగామిగా నిలిపే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నిర్మాణాలు ఎదురయ్యే సమస్యలను తన దృష్టికి తీసుకురావాలన్నారు. నిర్మాణాలు పూర్తి చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను అదిగమించి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక, సిమెట్, మెటల్ వంటి నిర్మాణ సామాగ్రిని ఎప్పటికప్పుడు సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా వుందన్నారు. లబ్దిదారుల సమక్షంలో వారు సంతృప్తి చెందేలా పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. నిర్మాణాల్లో తుది దశకు చేరుకుని రూఫ్ లెవెల్ స్థాయి నుండి రూప్ క్యాస్టింగ్ దశలో 5792 గృహా నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. లేఅవుట్లలో అవసరమైన అన్ని మౌలికవసతులు కల్పించాలన్నారు. ముఖ్యంగా రహదారులు, త్రాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించి గృహ ప్రవేశాలకు సిద్దం చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల నిర్మాణ పనులలో ఇబ్బందులు ఎదురై పనులు పూర్తి చేయడంలో జాప్యం ఏర్పడిరదని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గకు సంబంధించి నున్న లేఅవుట్లలో 4091, విజయవాడ తూర్పు నియోజకవర్గంకు సంబంధించి ఉప్పులూరు లేఅవుట్లలో 1050, జగ్గయ్యపేట నియోజకవర్గంకు సంబంధించి ముక్తేశ్వరపురం లేఅవుట్లలో 73, వెంగనాయకునిపాలెం లేఅవుట్లలో 32, వత్సవాయి లేఅవుట్లలో 126, నందిగామ నియోజకవర్గంకు సంబంధించి పరిటాల లేఅవుట్లలో 52, మైలవరం నియోజకవర్గంకు సంబందించి కాచవరం లేఅవుట్లలో 73, తిరువూరు నియోజకవర్గంకు సంబంధించి తిరువూరు లేఅవుట్లలో 326, గృహ నిర్మాణాలను పూర్తి చేయనున్నామని హౌసింగ్ అధికారులు జిల్లా కలెక్టర్‌కు తెలిపారు. నాడు`నేడు, గ్రామ వార్డు సచివాలయ నిర్మాణ పనులను నిర్థేశించిన గడువులో పూర్తి చేసి ప్రగతి నివేధికలను సమర్పించాలన్నారు. స్పందనలో ప్రజల నుండి స్వీకరించిన ఆర్జీలను పరిష్కరించి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, హౌసింగ్ పిడి శ్రీదేవి, డిఇవో సివి రేణుక వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.