-17న నమోదు చేసిన రైతుల జాబితా ఆర్‌బికెల వద్ద ప్రదర్శించండి…
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రైతులు పంట బీమా పథకం ద్వారా నష్ట పరిహారం పొందేలా రైతు చేపట్టిన ప్రతి పంటను ఈ` క్రాప్ నమోదు ప్రక్రియను ఈనెల 14వ తేదిలోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
ఈ`క్రాప్ నమోదు ప్రక్రియపై జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు జిల్లాకు చెందిన వ్యవసాయ అధికారులతో బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. టెలికాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతాంగం పండిరచే పంటలకు సంబంధించి ప్రకృతి వైపరిత్యాలు, చీడపీడల వలన ఎదురయ్యే పంట నష్టాలకు నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వం రైతు పంట బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. వ్యవసాయ అధికారులు రైతుభరోసా కేంద్రాల పరిధిలో క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు చేపట్టిన పంటలను ఈ`క్రాప్ విధానంలో నమోదు చేయవలసిన అవసరం ఉందన్నారు. గత అనుభావాలను దృష్టిలో పెట్టుకుని ఏరైతు తనకు రైతు పంటల బీమా పథకం ద్వారా నష్టపరిహారం పొందలేకపోయాననే ఫిర్యాదులు లేకుండా ఈ`క్రాప్ నమోదు చేయాలన్నారు. రైతులు కూడా వారు చేపట్టిన పంటకు సంబంధించి పంట వివరాలను రైతు భరోసా కేంద్రాలలో బయోమెట్రిక్ దృవీకరణ ద్వారా నమోదు చేసుకుని రశీదు పొందాలన్నారు. ఖరీఫ్ సీజన్‌లో ఎన్‌టిఆర్ జిల్లా కు సంబంధించి సుమారు 3,53,306 ఏకరాలలో రైతులు వివిధ పంటలను సాగు చేస్తున్నారన్నారు. ఇప్పటివరకు కేవలం 60 శాతం మంది రైతులు మాత్రమే ఈ`క్రాప్ విధానంలో పంటలను నమోదు చేసుకుని బయోమెట్రిక్ దృవీకరణ పొందాలన్నారు. మిగిలిన రైతులు ఈనెల 14వ తేదిలోపు తప్పనిసరిగా రైతు భరోసా కేంద్రాలలో వారి పంటల వివరాలను నమోదు చేసుకున్నట్లయితే భవిష్యత్‌లో వారు పంట నష్టాలకు సంబంధించి బీమా పరిహారం పొందే అవకాశం ఉందన్నారు. రైతులు పండిరచిన పంటలను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసేందుకు ఈ`క్రాప్ నమోదు తప్పనిసరి చేయడం జరిగిందన్నారు. ఈ`క్రాప్ నమోదు చేసిన ప్రతి రైతు నుండి ప్రభుత్వం పంటలను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించడం జరుగుతుందన్నారు. ఈనెల 17వ తేదిన రైతుల నుండి సేకరించిన ఈ`క్రాప్ పంటకు సంబంధించిన జాబితాను సామాజిక తనిఖీ నిమిత్తం రైతు భరోసా కేంద్రాల వద్ద ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు వ్యవసాయ శాఖ అధికారిణి యం విజయభారతిని ఆదేశించారు.