Breaking News

పిడింగొయ్య గ్రామంలో ఈ క్రాప్ రికార్డ్స్ పరిశీలించడం జరిగింది…

-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ క్రాప్ బుకింగ్, ఈ కేవైసి ద్వారా రైతులు వారు సాగుచేసే పంటకు గిట్టుబాటు ధర, భరోసా పొందగలుగుతారని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత ఆన్నారు. శుక్రవారం మధ్యాహ్నం రాజమండ్రి రూరల్ పిడింగొయ్య గ్రామంలో ఈ క్రాప్ నమోదు చేసుకున్న నలుగురు రైతుల రికార్డ్స్ లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వము రైతులకు విత్తు నుంచి పంట కొనుగోలు చేసే వరకు ప్రతి ఒక్క స్థాయి లోనూ వారికి భరోసా కల్పిస్తూ అండగా నిలవడం జరుగుతోందన్నారు. ఈ క్రాప్ యొక్క ప్రయోజనాలు రైతులకు వివరించి, ప్రతి ఒక్క రైతు వారు సాగు చేసే పంట యొక్క వివరాలు ఈ క్రాప్ నమోదు తో పాటు ఈ కేవైసి తప్పనిసరి చెయ్యడం జరిగిందన్నారు. క్షేత్ర స్థాయి లో జరుగుతున్న ఈ క్రాప్ నమోదు ను ఆయా క్షేత్ర స్థాయి లో పనిచేసే అధికారులు, సిబ్బంది సక్రమంగా డేటా నమోదు చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి కలెక్టర్ స్థాయి లో మూడు గ్రామాల్లో క్షేత్ర స్థాయి తనిఖీ కై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వటం జరిగిందన్నారు. అందులో భాగంగానే ఈరోజు రాజమండ్రి రూరల్ గ్రామం పిడింగొయ్య లో రైతులు ఈ క్రాప్, ఈ కేవైసి చేసిన రికార్డులను ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు మాధవీలత తెలిపారు. ఈ క్రాప్ ద్వారా రికార్డులు సరిపోయాయని కలెక్టర్ పేర్కొన్నారు. సంబందించిన సమగ్రమైన నివేదిక ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. రైతు సాగు చేసే పంట, పెట్టుబడి, ఆదాయం వంటి వాటిపై రైతుతో కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడడం విశేషం. సహజ సిద్దంగా అగ్రికల్చరల్ శాస్త్రవేత్త అయిన కలెక్టర్ మాధవీలత రైతులతో వరి, కొబ్బరి, అరటి సాగు పై రైతుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, ఇతర అధికారులు, రైతులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *