విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏ.పి.జె అబ్దుల్ కలాం 91వ జయంతిని పురష్కరించుకొని విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం లో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, మరియు అధికారులతో కలసి డాక్టర్ ఏ.పి.జె అబ్దుల్ కలాం చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళ్ళు అర్పించారు. ఈ సందర్బంలో సైంటిట్స్ గా కెరీర్ మొదలుపెట్టి భారత సంరక్షణ కోసం అగ్ని అనే క్షపణిని తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారని, మూడవ భారత రత్న అవార్డు పొందిన రాష్ట్రపతిగా కలాం గారు ప్రజల రాష్ట్రపతిగా ఎనలేని కీర్తిని సాధించిన మహోన్నత వ్యక్తి కలామ్ గారు అని వారు దేశానికి చేసిన సేవలను కొనియాడరు. కార్యక్రమంలో 53 వ డివిజన్ కార్పొరేటర్ మహదేవ్ అప్పాజీ రావు, అదనపు కమిషనర్(జనరల్) యం.శ్యామల, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) శ్రీమతి కె.వి సత్యవతి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.పి.రత్నావళి, ప్రాజెక్ట్ ఆఫీసర్ యు.సి.డి శకుంతల, సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, ఏ.డి.హెచ్ శ్రీనివాసు, మేనేజర్ బి.శ్రీనివాస్ రావు గారు, మరియు వి.ఎం.సి.అధికారులు ,సిబ్భంది పాల్గొనారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …