Breaking News

మీ సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటాను

-సచివాలయ ఉద్యోగి చంద్రవర్మ మృతి విచారకరం …
-ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి
-వర్మ కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కోసం సిఫార్సు చేస్తాం
-సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం
-జిల్లా కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జి. దొంతమూరు సచివాలయంలో హార్టికల్చర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఇల్లే సుభాష్ చంద్రవర్మ మృతి దురదృష్ట కరమని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.

సోమవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి, విజ్ఞాపన పత్రాన్ని తీసుకుని, వారి సమస్యలపై సానుకూలంగా స్పందించారు. ఈ సచివాలయ ఉద్యోగుల సమస్యలు జిల్లా స్థాయి లో పరిష్కారం చేసేవి అయితే తాను పరిష్కారం చేస్తాననీ, సాధ్యం కాని ఎడల ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. సచివాలయం పరిధిలో పనిచేసే సిబ్బంది విషయం లో సానూకూల దృక్పథం తో ఉన్నందునే, జిల్లాలో ఏ ఒక్క వ్యవసాయ సహాయక సచివాలయ సిబ్బందికి షో కాజ్ నోటీస్ జారీ చేయడం కానీ, సస్పెన్షన్ వేటు కానీ వేసి ఉండలేదన్నారు. మిగతా జిల్లాలో క్రాప్ బుకింగ్ లో చేసిన అవకతవకలు పై చర్యలు తీసుకోవాడంపై ఈ సందర్భంగా ఉదహరించారు. జాయింట్ కలెక్టర్ నుంచి సచివాలయ సిబ్బంది, వాలంటీర్ వరకు ప్రతి ఒక్కరూ తన కుటుంబ సభ్యులని, వారి పని వత్తిడి విషయం, సమస్యలు ఎప్పుడూ తన వద్ద ప్రస్తావించలేదని కలెక్టర్ అన్నారు. ఇకపై ఏదైనా సమస్య ఉంటే మీ ప్రతినిధులు తన వద్దకు నేరుగా వొచ్చి తెలియచేయండని స్పష్టం చేశారు. టెలి కాన్ఫరెన్స్ సంబందించిన అంశాన్ని పరిశీలన చేస్తానని, టెలి కాన్ఫరెన్స్ ప్రక్రియ విషయంలో సమయ పాలన ను క్రమద్దికరణ చేస్తానని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ వాఖ్యా లపై ఇచ్చిన ఫిర్యాదును, ఈ సంఘటన పై పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని పూర్తి స్థాయి విచారణ నిర్వహిస్తానని , ఎవరిది తప్పు అనే అంశాన్ని కూడా నిర్ధారణ చెయ్యడం జరుగుతుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ క్రాప్ బుకింగ్ ఎందుకు చేస్తున్నాం.. ఎక్కడలేని సచివాలయ వ్యవస్థ మన రాష్ట్రం లో ప్రవేశపెట్టి , లక్షలాది మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే కాకుండా, వారికి ఉద్యోగ భద్రతను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కలుగ చేశారని అన్నారు. ప్రజలకు ఎంతో మేలు చేసే వ్యవస్థ ఇందులో జరిగిన నియామకాలు వేలు ఎత్తి చూపే అవకాశం లేకుండా పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టారన్నారు. సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రం ద్వారా సేవలు విజయవంతం అవడంలో ప్రభుత్వం ముందు చూపు, నిర్ణయాలే కారణం అని సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు. పరిపాలనలో జవాబుదారీ తనం, పారదర్శకత నేపథ్యంలో తీసుకుని వచ్చిన ఈ వ్యవస్థ ద్వారా మరింత గా మానవ వనరులు అందుబాటులోకి వచ్చాయన్నారు. అసలైన రైతులకు అన్యాయం జరగకూడదని, ఈ కేవైసి తీసుకుని వచ్చినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. గతంలో కొందరు చేసిన డేటా ఎంట్రీ తప్పుల వల్ల హార్టికల్చర్ లో వేరే పంట నమోదు వల్ల ఇబ్బంది వచ్చిందన్నారు. ఈ సమావేశంలో. ఆర్డీవో లు ఎస్. మల్లిబాబు, ఏ. చైత్ర వర్షిణి, డి ఎ ఓ ఎస్. మాధవరావు, డి హెచ్ వో వి. రాధాకృష్ణ, డీల్ డి ఓ లు పి. వీణా దేవి, వి. శాంతమణి , జిల్లా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బి. అంజనరెడ్డి, జిల్లా అధ్యక్షులు విప్పర్తి నిఖిల్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *