కూటమి పాలనలో హిందూ ఆలయాలకు భద్రత కరువు…. : మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

Malladi

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలు, విగ్రహాలపై వరుస దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. బాపట్ల జిల్లా చీరాల మండలం పేరాలలో అభయాంజనేయ స్వామి విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం విజయవాడలోని జనహిత సదనంలో విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ.. ఆలయాల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, భద్రతా పర్యవేక్షణ లేకపోవడం పోలీసు, దేవాదాయ శాఖల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా హిందూ దేవాలయాలకు పటిష్టమైన భద్రత కల్పించాలని, పేరాల ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.