విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ, భవానీపురం, బబ్బూరిగ్రౌండ్స్‌లో ఆర్యవైశ్య కార్తీక వనసమారాధన-ఆత్మీయ సమ్మేళనం జరిగింది. విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు, సంఘం అధ్య క్షుడు పల్లపోతు మురళీకృష్ణ (కొండపల్లి బుజ్జి) పర్యవేక్షించారు. ముఖ్య అతిథులుగా ఉప సభపతి వీరభద్ర స్వామి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఎమ్మెల్సీ పోతుల సునీత, ఇతర MLA లు ఆర్యవైశ్య ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్బంగా వీరభద్ర స్వామి మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా వన సమారాధన ప్రోగ్రాం ద్వారా ఆర్యవైశ్యా కులస్తులను ఒక తాటి పైకి తేవడం శుభ పరిణామం అన్నారు. వ్యాపారులకు మరియు మా ఆర్యవైశ్య సోదరులకు మనో దైర్యం కల్పించే జగన్ మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా 64 డివిజన్లలోని ఆర్యవైశ్యులతోపాటు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 20 వేల మంది హాజరయ్యారు. సుమారు 2 వేల మందికి సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. జబర్దస్త్ టీం స్పెషల్ స్కిడ్లుతో, వివిధ సాంస్కృత కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. అనంతరం ప్రశంసా పత్రాలు, జ్ఞాపకాలు అందజేశారు. ఆర్యవైశ్యుల్లో సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించిన వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో అర్టిఐ చీఫ్ కమిషనర్ రేపాల శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బ చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ & డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కాల ద్వారకానాధ్, అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొండపల్లి బుజ్జి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ల విద్యాధర రావు, యువజన సంఘం అధ్యక్షులు గుడిపాటి కిషోర్, మహిళ అధ్యక్షురాలు అత్కురి శ్రీదేవి, సేవాదళ్ అధ్యక్షులు శేగు వెంకటేశ్వర రావు తదితర ఆర్యవైశ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …