-కాల పరిమితి పెంచాలి…
-ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుండుపల్లి సతీష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రాడ్యుయేట్ (పట్టభద్రుల) ఓటు నమోదు పై అవగాహనా క్యాంపైనింగ్ ముమ్మరం చేసి, ఓటు నమోదు కార్యక్రమం కాల పరిమితి పెంచవలసినదిగా రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాని బుధవారం కలిసి వినతిపత్రాన్ని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, అడ్వకేట్ గుండుపల్లి సతీష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదు పై అవగాహనా క్యాంపైనింగ్ ముమ్మరం చేయాలని.. ఎందువలన అంటే పాత లిస్ట్ రద్దయినందువల్ల గ్రాడ్యుయేట్ ఓటర్లు ఇది గమనించి తిరిగి నమోదు చేసుకోవాలని తెలియజేయడం కోసం కాంపైనింగ్ అవసరముందన్నారు. అలాగే ప్రక్రియకు కాల పరిమితి పెంచవలసిందిగా కోరుచున్నానన్నారు. ఎలక్షన్ కమీషన్ ఈ ఎన్నికలకు అక్టోబరు 1 నుంచి ఓటర్ల నమోదుకు అవకాశం ఇచ్చి 2019 అక్టోబరు 31వ తేది నాటికి డిగ్రీ ఉత్తీర్ణులైన వారే ఓటరుగా నమోదుకు అర్హులని, వీటి స్వీకరణకు నవంబరు 7వ తేది వరకు గడువు ఉంటుందని, నవంబరు 23న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తారని, ఆ రోజు నుంచి డిసెంబరు 9వ తేది వరకు దీనిపై అభ్యంతరాలు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.
అయితే డిసెంబరు 30న తుది ఓటరు జాబితా ప్రచురిస్తారని ముందుగా ఎలక్షన్ కమీషన్ ప్రకటించినప్పటికి అకాల వర్షాలు కారణంగా, సాంకేతిక సమస్యలు కారణంగా, ఓటర్ నమోదు అప్లై చేసేటప్పుడు సర్వర్ లోపాలు కారణంగా చాలా వరకు ఓటర్ నమోదు జరగలేదని తెలిపారు. అంతేకాకుండా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది ఏ యొక్క రాజకీయ పార్టీకి సంబందించిన ఎన్నికలు కావు అని ఈ ఎన్నికలు గ్రాడ్యుయేట్ మాత్రమే పాల్గొని ఓటు నమోదు చేసుకొని గ్రాడ్యుయేట్లకు ఉపయోగపడే వ్యక్తిని ఎన్నుకునే అవకాశం వుందన్నారు. ఓటరు నమోదు తక్కువ వ్యవధి వున్న కారణంగా, దీనిపై ప్రతి చోట స్పెషల్ క్యాంపైనింగ్ ప్రోగ్రామ్స్ గ్రాడ్యుయేట్ ఓటు నమోదు కార్యక్రమం నిర్వహించడం వలన అందరి తెలుస్తుందన్నారు. ఓటర్లకు ఎన్నికలు పై జిల్లా ఎలక్షన్ ఆఫీసర్స్ మరియు బూత్ లెవిల్ ఆఫీసర్స్ (బిఎల్ఓ) ఆఫీసర్స్లతో ఎమ్మెల్సీ ఎలక్షన్ అవగాహన కల్పించాలన్నారు. ఆర్హులైన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్గా నమోదు చేసుకోనేట్టుగా, గడువు పెంచాలని కోరారు. అన్ని నియోజకవర్గాలలో ఉపాధ్యాయులతోపాటు అన్ని శాఖల అధికారులు, తమ సిబ్బందితో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకోనుటకు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సచివాలయాల వాలంటీర్లు కూడా నమోదు చేసుకుని ఓటు హక్కు పొందాలని కోరారు.