విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరం మరింత కనువిందుకలిగేలా రహదారులకు ఇరువైపులా ఆకర్షణీయంగా ఉండే మొక్కలను విస్తృతంగా నాటాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు నగరపాలక సంస్థ కమిషనర్, అధికారులను కోరారు. నగరం…. పచ్చల హారం..లో భాగంగా రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం పై శనివారం కలెక్టర్ ఢిల్లీ రావు నగరపాలక సంస్థ కమిషనర్, అధికారులతో కలెక్టరేట్ నుండి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదార్లకు ఇరువైపుల పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణం కల్పించాలన్నారు. రోడ్డు మార్గాన మిడియన్ ప్రదేశంలో అందమైన పూల మొక్కలతో ఆకట్టుకునేలా పచ్చదనాన్ని సంతరించేలా తీర్చిదిద్దాలన్నారు.ఇతర ప్రాంతాల నుండి నగరానికి చేరుకునే నాలుగు వైపులా రహదారులకు ఇరువైపులా కనీసం 100 మొక్కలను ఇరువైపులా 50 చొప్పున నాటి వాటిని సంరక్షించాలన్నారు. ఆకర్షణీయంగా ఉండే పూలమొక్కలైన లాగర్ స్టోమియా, బహునియా, కాసియా ఫిస్టులా, జకరండ ఎవెన్యూ,
ఓర్ణమెంటెల్ బ్యాంబు, చంపక, రాయల్ ఫామ్, బూటియా, చెర్రీ ట్రీ రకంముక్కలను పెంచడం ద్వారా వివిధ రంగుల ఆకర్షణీయమైన పుష్పాలతో నగరం సుందరీకరణ సంతరించుకుంటుందని కలెక్టర్ అన్నారు. కనకదుర్గమ్మ వారధి నుండి నగరానికి చేరుకునే ప్రారంభంలో జాతీయ రహదారికి కుడివైపున ఉన్న మార్గంలో మరింత ఆకర్షణీయమైన మొక్కలను నాటాలని తద్వారా వివిధ ప్రాంతాల నుండి నగరానికి చేరుకునేవారు ఆహ్లాదాన్ని పొందుతారన్నారు. మొక్కలు నాటి వాటిని టీ గార్డుల ద్వారా సంరక్షించాలన్నారు. నగరం అంతటా రహదాలకు ఇరువైపులా కనువిందు చేసే అందమైన పూల మొక్కలను పెంచడం ద్వారా నగరం మరింత పచ్చని శోభ సంతరించుకుంటుందని కలెక్టర్ ఢిల్లీ రావు అన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …