విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దివంగత ములాయం సింగ్ యాదవ్ సంస్మరణ సభ విజయవాడ లోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో శనివారం జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మిత్రులు మధు బొట్టా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పలువురు వక్తలు మాట్లాడుతూ ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి గా దేశ భద్రతకు ఎంతో కీలకమైన పాత్ర వహించారని బిసి సామాజిక వర్గాలకు, దేశ ప్రజలకు ఎంతో సేవలు అందించారని కొనియాడారు. బీసీలు అందరూ ఐక్యంగా ఉంటే రానున్న రోజుల్లో రాజ్యాధికారం బీసీ లదే నని పలువురు పిలుపునిచ్చారు. యు పి నుండి ఏ పి వరకూ ములా యం సింగ్ కి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుందటే అది వారి 60 ఏళ్ల రాజకీయ అనుభవాలు, దేశానికి, బీసీ ల సంక్షేమ కార్యక్ర మాలు కోసం ఆయన చేసిన సేవలే ఇందుకు తార్కాణమని పేర్కొన్నారు. రాజకీయ పార్టీకు అతీతంగా అనేక మంది పాల్గొని అయన సేవలను కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు బీద మ స్తాన్ రావు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి టిడిపి ఫ్లోర్ లీడర్ యన మల రామకృష్ణుడు, సిపిఐ రాష్ట్ర సెక్రటరీ రామకృష్ణ, మాజీ పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి, మాజీ మంత్రి మరియు శాసనసభ్యులు కొలుసు పార్ధసారధి, ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి ఎం.ఎల్.సి.లు డొక్కా మాణిక్కా ప్రసాద్, బచ్చుల అర్జనుడు, మాజీ మంత్రి మరియు మాజీ మంత్రులు పాలేటి రామారావు, రవీంద్ర తదితరులు ములాయం. సింగ్ యాదవ్ తో తమకున్న పరిచయాలు, అనుభవాలను, దేశానికి అందించిన సేవలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలోఅభిమానులు, బీసీ వర్గీయులు రాజకీయాలకు అతీతంగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ హరీష్ రావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య, ప్రముఖ బీసీ ఉద్యోగుల సంఘ నేత డాక్టర్ అలా వెంకటేశ్వర రావు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం. రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు, యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్, అఖిలభారత యాదవ మహా సంఘము అధ్యక్షులు ఉప్పుటూరి పేరయ్య, సెక్రటరీ జనరల్ బొడ్డు రమేష్ యాదవ్, అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ శతాబ్ది ఉత్సవాల రాష్ట్ర అధ్యక్షులు బొట్ల రామారావు యాదవ్, ప్రధాన కార్యదర్శి అంగడాల పూర్ణచంద్రరావు సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలు గౌతు శిరిషా, పిసిసి అధికారి ప్రతినిధి కొలను కొండ శివాజీ, మాచర్ల బీసీ సంక్షేమ సంఘం సమన్వయకర్త నాగరాజు యాదవ్, అల్లం రాజేష్ తదితర వివిధ బీసీ ఉద్యోగ సంఘ నేతలు, యువజన నాయకులు, వేలాది మంది బీసీ సంఘీయులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …