-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం ఆంధ్ర లయోలా కళాశాలలో భద్రపరిచిన రెండవ సాధారణ ఎన్నికలు–2026కు సంబంధించిన ఎన్నికల సామగ్రిని పటమట ఇండోర్ స్టేడియానికి తరలించేందుకు చేపట్టిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల సామగ్రి తరలింపు ప్రక్రియలో అన్ని భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సామగ్రి తరలింపు పూర్తయ్యే వరకు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి ప్రతి అంశాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సామగ్రి మొత్తాన్ని నిర్దేశించిన ప్రదేశానికి సురక్షితంగా తరలించిన అనంతరం, వాటిని క్రమపద్ధతిలో భద్రపరిచేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు సిబ్బంది పాల్గొన్నారు.
