-టిడిపి రాష్ట్ర కార్యదర్శి పెందుర్తి శ్రీనివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి రాజధానిలో 90% శాతం పూర్తయిన పేదల ఇళ్ళు రంగులు వేసి లబ్ధిదారులకు ఇవ్వలేని వైసిపి ప్రభుత్వం మూడు రాజధానిలు కడతాం అనటం హాస్యాస్పదమని, రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు వైసిపి రంగులు వేసి ప్రజా ధనాన్ని వృదా చేసి కోర్టులలో చివాట్లు తిన్నారే కానీ ఆ వ్యయాన్ని కర్నూలు , విశాఖ జిల్లాల్లో టిడిపి హయాంలో 90 శాతం పూర్తయిన టిడ్కో గృహాలకు వెచ్చించలేకపోయారని, వైసీపికి ప్రజల మీద ఎంత చిత్త శుద్ది వుందో ఈ రంగుల అంశంలో కనిపిస్తుందని టిడిపి రాష్ట్ర కార్యదర్శి పెందుర్తి శ్రీనివాస్ అన్నారు. ప్రజల దగ్గర చెత్త పన్ను వసూలు చేసి ప్రభుత్వ సలహాదారులకు జీతాలిస్తున్న ప్రభుత్వం దేశంలో వైసిపి ఒక్కటేనని శ్రీనివాస్ ఆరోపించారు. మూడు రాజధానులు కేవలం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే కుటిల రాజకీయమేనని, రాష్ట్ర ప్రధాన రహదారుల్లో గుంతలు పూడ్చలేని వైసిపి ప్రభుత్వం మూడు రాజదానులు కడతామనటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రాజధానికి నిధులు వద్దని ముఖ్యమంత్రి స్వయంగా కేంద్రానికి ఉత్తరం రాశారంటే ప్రజలు ఇంకా అమాయకులు కాదని, బుదవారం కర్నూల్ జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్నందున మళ్ళీ కర్నూల్ న్యాయ రాజధాని అంటూ కావాలనే ఈ అంశాన్ని మంత్రి వీరభద్ర స్వామి లేవనెత్తారని పెందుర్తి శ్రీనివాస్ ఆరోపించారు.