విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణలంక, రాణిగారి తోట, రామలింగేశ్వర నగర్ ప్రాంతాలలో నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ శనివారం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ, పారిశుధ్య నిర్వహణ విధానము మరియు స్థానిక ప్రజల ఇబ్బందులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. 15వ డివిజన్ నందలి రామలింగేశ్వర నగర్ ప్రాంతములో గల రిటైనింగ్ వాల్ ప్రక్కన 20 యం.ఎల్.డి సేవెజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద రోడ్ అభివృద్ధికి ప్రణాళికలను సిద్దం చేయాలనీ అధికారులను ఆదేశించారు. అదే విధంగా డ్రెయిన్ కట్టడానికి రోడ్డు మార్జిన్ ప్రణాళికలను సిద్దం చేయాలని, అక్కడ ఉన్నటువంటి ఇళ్ళులనింటిని సర్వే చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలను సిద్దం చేయాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (పార్క్స్) అధికారులను ఆదేశించారు. పర్యటనలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, డిప్యూటీ సిటి ప్లానర్ (ప్లానింగ్ ) జుబిన్ శిరన్ రాయ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.చంద్రశేఖర్, అధికారులు మరియు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …