Breaking News

అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ ఆసుపత్రులలోనే స్థానికంగా అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని, ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయించకుండా తండా ప్రజలు వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం, వైద్య విద్యాశాఖ మంత్రి విడదల రజిని అన్నారు.
రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం, వైద్య విద్యా శాఖ మంత్రి విడదల రజిని, స్థానిక శాసనసభ్యులు కొక్కిలిగడ్డ రక్షణనిధి, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ యంటి. కృష్ణబాబు, కమీషనర్‌ జె. నివాస్‌, జిల్లా కలెక్టర్‌ యం.డిల్లీరావుతో కలిసి శనివారం తిరువూరు నియోజకవర్గంలోని ఏ కొండూరు మండలంలో క్రానిక్‌ కిడీ్న డిసీజస్‌ సంబంధించి దీప్లా నగర్‌ తండా, మాన్సింగ్‌ తండాలలో పర్యటించి స్థానికులతో నేరుగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి విడదల రజని మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపి వైద్య ఆరోగ్య రంగాలపై తొలి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఏ కొండూరు మండలంలోని తండాలలో ప్రజలు క్రానిక్‌ కిడ్నీ డిసీజస్‌తో బాధపడుతున్నారని, సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. దీనిలో భాగంగా వ్యాధికి తగిన కారణాలను, మూలాలను తెలుసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారన్నారు. ఏ కొండూరు మండలానికి త్రాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.38 కోట్లతో జల జీవన్‌ మిషన్‌లో ఇంటింటికి కుళాయి ద్వారా కృష్ణానదీ జలలాను అందించడం జరుగుతుందని, ఇందుకు సంబంధించి అనుమతులు మంజూరు అయ్యాయని ఈ పథకం త్వరితగతిన కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కిడ్నీ వ్యాధి బారిన పడిన వారు విజయవాడకు వెళ్లి ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించవద్దు అన్నారు. స్థానిక పిహెచ్‌సిలో డయాలసిస్‌ చేసి నాణ్యమైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశామని, రాబోయే రోజులలో మూడు డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి, ఆరోగ్యశ్రీ అనుమతులు ఉన్న ప్రైవేటు ఆసుపత్రులు, నూజివీడు ఏరియా ఆసుపత్రులలో కూడా డయాలసిస్‌ వైద్యం అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా వ్యాధిగ్రస్తులకు ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం 5 తండాలకు శుద్ది చేసిన నీరు ట్యాంకర్ల ద్వారా అందించడం జరుగుతుందన్నారు. 15 తండాలకు వాహనాల ద్వారా రక్షిత త్రాగు నీటిని సరఫరా చేస్తామని, రానున్న ఆరు నెలలలో 6 కోట్లతో పైపు లైన్‌ల ద్వారా రక్షత త్రాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. కిడ్నీ వ్యాధి సమస్యను ఎదురుకునేందుకు ఎంత ఖర్చుకైన వెనుకాడని విధంగా ప్రభుత్వం అండగా వుంటుందన్నారు. అపోహలకు తావు లేదన్నారు. డయాలసిస్‌ వ్యాధిగ్రస్తులకు రవాణాకు 12 సీట్లుగల ఎక్యూప్‌మెంట్‌తో మినీ వాహనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తండాలలో ప్రతీ నెల మెడికల్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేసి సీనియర్‌ నెప్రాలజిస్ట్‌ వైద్యులతో వైద్య పరీక్షలు చేయించడం జరుగుతుందని, అల్‌ ఇండియా ఇన్‌ట్యూట్‌ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ సూచించిన మందులను ఉచితంగా అందిసామన్నారు. తండాలలోని అందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని ముఖ్యంగా 25 సంవత్సరాలు వయసుకలిగిన వారు పరీక్షలకు సహకరించాలన్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో 14 ప్రైవేటు కిడ్నీ వ్యాధి కిచిత్స అందించే ఆసుపత్రులలో అనుమతులు ఉన్నాయన్నారు. కిడ్నీ వ్యాధి చికిత్సకు అవసరమైన 6 కోట్ల రూపాయల ఖరీదైన మందులను కొనుగోలు చేసి అందుబాటులో ఉంచామని మంత్రి విడదల రజిని అన్నారు.
శాసనసభ్యులు రక్షణ నిధి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ కొండూరు మండలంలో చిరకాల సమస్యను పరిష్కరించేందుకు రక్షత త్రాగునీరు సరఫరాకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణానదీ జలాల పంపిణీని జల జీవన్‌ మిషన్‌ ద్వారా చేపడుతున్నారన్నారు. మండలంలో డయాలసిస్‌ వ్యాధిగ్రస్తులు నూజివీడు, విజయవాడ ఆసుపత్రులకు వెళ్లనవసరం లేకుండా స్థానికంగా ఏ కొండూరు పిహెచ్‌సిలో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. 10 తండాలలో ఆర్వోప్లాంట్‌ ఏర్పాటు చేశామని 6 కోట్ల నిధులతో కృష్ణానది జలాలను 15 తండాలకు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని శాసనసభ్యులు అన్నారు.
జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మాట్లాడుతూ 15 తండాలలో 15 వేల జనాభ నివసిస్తున్నారని వీరిలో 10 మంది డయాలసిస్‌ వైద్యం తీసుకుంటున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలోనే వైద్యం అందించేలా అన్ని చర్యలు తీసుకుంటామని వ్యాధికి తగిన కారణాలను మూలాలను అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారం చూపుతామని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
అనంతరం ఏ కొండూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో సేమి ఆటోమెటిక్‌ ఎనలైజర్‌ డయాలసిస్‌ వైద్యసేవలను పరిశీలించారు. ఆయుష్‌ విభాగంలో త్వరలో అపోలో ఆసుపత్రి సహాకారంతో ఆధునీకరించనున్న మూడు పడకల డయాలసిస్‌ కేంద్రాన్ని పరిశీలించారు.15 సీిట్ల కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రవాణ వాహనాన్ని ప్రారంభించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *