రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం లో గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్దే ప్రత్యక్ష నిదర్శనం అని పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం లోలాకుల ప్రాంతంలో రూ.70 లక్షలతో అభివృద్ది చేసిన పార్కును ఆయన రుడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి మునిసిపల్ కమిషనర్ దినేష్ కుమార్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి భరత్ మాట్లాడుతూ, ఆధ్యాత్మిక నగరమైన రాజమహేంద్రవ రానికి మరింత శోభ చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులం అందరం సమిష్టి బాధ్యత తీసుకుని రాష్ట్రంలోనే అత్యంత వేగంగా రాజమహేంద్రవరం నియోజక వర్గాన్ని అభివృద్ధిలో ముందు వరసలో ఉంచుతున్నామని పేర్కొన్నారు. కలెక్టర్, కమిషనర్ సహకారం అందిస్తూ ఎన్నో పనులు చేపట్టడం జరిగిందన్నారు. నగరం యొక్క మాస్టర్ ప్లాన్, నగరానికి అనుకుని ఉన్న జాతీయ రహదారులపై చేపడుతున్న పై వంతెన పనులు నుంచి ప్రతీ ఒక్క పనిని ఎంతో నిబద్దతతో చేపట్టి పూర్తి చేసే విధానం లో అడుగులు వేయడం జరుగుతోందన్నారు. పర్యావరణ కాలుష్యము అరికట్టే చర్యల్లో గోదావరీ నది జలాలు ప్రక్షాళన , నగరంలో మొక్కల పెంపకం వంటి విషయాల్లో తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గోదావరీ ఘాట్స్ మధ్య కూడా అనుసంధానం మార్గం ద్వారా రాబోయే ఏడాది కాలంలో గోదావరీ గట్టు రూపు రేఖలు అహల్లద కరంగా మార్చబోతునట్లు భరత్ రామ్ తెలిపారు. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. దేవిచౌక్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన విక్టోరియా లైటింగ్ తరహాలో మార్కెట్ లో కోటగుమ్మం నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు కమిషనర్ ద్వారా కోటి రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. నగరం లో లోలాకుల పార్కును ప్రజలకు అందుబాటులో తీసుకుని రావడం జరిగిందనీ కమిషనర్ కె. దినేష్ కుమార్ అన్నారు. రూ.70 లక్షలతో చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ఎంపి భరత్ రామ్, రుడా చైర్ పర్సన్ ఎమ్. షర్మిలా రెడ్డి లు ఎంతో తోడ్పాటు ఇవ్వడం జరిగిందన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో మరో మూడు థిమ్ పార్కులను కూడా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. నగరానికే తలమానికంగా నిలిచేలా 6 లేదా 7 ఎకరాల్లో “సీటీ పార్కు” ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, అందుకు అనుగుణంగా ఉండే ప్రాంతం గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags rajamendri
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …