విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ చాత్తాద శ్రీ వైష్ణవ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో భవానీపురం నందుగల సాయి అన్న గార్డెన్స్ నందు కార్తీక సమారాధన కార్యక్రమం లో కార్తీక తులసీ దామోదర పూజా కార్యక్రమం జరిగింది. తదుపరి రాష్ట్ర సంఘ సమావేశం లో ప్రభుత్వం, ప్రముఖ సంస్థలచే పురస్కారాలు పొందిన తెలుగు భాషా పురస్కారం పొందిన టి.శోభనాద్రి, ఉత్తమ ఉపాధ్యాయురాలు పురస్కారం పొందిన టి శ్రీదేవి, ఉత్తమ మృదంగం విద్వాన్సుల విభాగంలో పురస్కారం పొందిన టి.ప్రభాకర్ రావు, ప్రముఖ పారిశ్రామిక సంస్థ టాటా స్టీల్ చే ఉత్తమ వ్యాపారి పురస్కారాన్ని అందుకున్న టీ వెంకటేశ్వరరావు లకు రాష్ట్ర సంఘం అధ్యక్ష కార్యదర్శులు
టీ. మంగయ్య, ఎస్పీ.యశోద శేషగిరిరావుల ఆధ్వర్యంలో సత్కరించటం జరిగింది. తదుపరి మ్యూజికల్ చైర్ లెమన్ స్పూన్, డాన్స్ లాంటి ఆటల పోటీల కార్యక్రమాలు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పరిచయ వేదిక హాజరైన వధూవరులను వేదిక పైన పరిచయం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చాత్తాద శ్రీ వైష్ణవ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్లు తొండ.గీతాంజలి, టీ ప్రమీల, టి.హరి నారాయణ, రాష్ట్ర సంఘ సలహాదారులు టి కృష్ణయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టీవీ రమణ, రాష్ట్ర కోశాధికారి ఎస్.శ్రీనివాసు సూరి,కృష్ణాజిల్లా సంఘ అధ్యక్ష కార్యదర్శులు టి. పూర్ణయ్య, ఎం.లక్ష్మణరావు, ఏపీ పిటిడి బీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు. ఎస్పి శేషగిరిరావు, సంఘ నాయకులు హాజరయ్యి కార్యక్రమాలు జయప్రదం చేశారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …