రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా డిజిటల్ గ్రంధాలయాలపై విద్యార్ధినీ విద్యార్ధులకు అవగాహన , సామూహిక స్వీయ పఠనము, జాతీయ గ్రంధాలయ వారోత్సవాల ముగింపు సభ అనంతరం బహుమతి ప్రదానోత్సవం జరిగినది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత పి..వి.ఎస్. కృష్ణారావు వహించగా, అతిథులు గా ఎస్కే ఆర్ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డా. పి.రాఘవ కుమారి, ఇంగ్లీష్ హెచ్ ఓ డి డా. బి. అనురాధ సూర్య కుమారి, పి. రాంబాబు లు విచ్చేశారు.
అధ్యక్షత వహించిన పి..వి.ఎస్. కృష్ణారావు మాట్లాడుతూ మానసిక వికాసానికి పుస్తక పఠనం ఎంతగానో ఉపకరిస్తుందని విధ్యార్ధులు అందరూ తప్పక మంచి పుస్తకాలను చదవాలని తెలియచేసారు. డా. పి.రాఘవ కుమారి యువతకు మంచి స్పూర్తి ని ఇచ్చే సందేశాన్ని ఇచ్చారు. సమాజంలో మంచి గుర్తింపు నిచ్చే వ్యక్తి గా ఎదగాలి అంటే పుస్తకం చదవడం అనేది ఒక మంచి అలవాటు అని విలువలతో కూడిన విద్య మనిషికి మంచి వున్నతమైన వ్యక్తిగా గుర్తింపును ఇస్తుందని కావున ప్రతీ విధ్యార్ధీ పుస్తక పఠనం అనేది ఒక అలవాటుగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.
డా. బి. అనురాధ సూర్య కుమారి మాట్లాడుతూ గ్రంధాలయం అనేది గ్రంధాల ఆలయం అని తన దృష్టిలో గ్రంధమే ఒక ఆలయం అని చిరిగిన చొక్కా అయినా తొడుక్కో ఒక మంచి పుస్తకం కొనుక్కో అనే కందుకూరి వీరేశలింగం గారి మాటలను గుర్తుచేశారు.
గ్రంధాలయ అధికారి కె. సుధాకర రావు మాట్లాడుతూ గ్రంధాలయాలలో ఉండే విలువైన పుస్తక సంపదను డిజిటల్ చేయుట వల్ల భావితరాలకు ఈ సంపద ఎంతగానో వుపయోగపడతాయని గౌతమీ గ్రంధాలయంలో గల అరుదైన పుస్తక సంపదను డా. అరిపిరాల నారాయణ రావుగారి నేతృత్వంలో డిజిటలైజేషన్ ప్రక్రియ పురోగతిలో ఉందని వారికి ఈ సభా ముఖంగా కృతజ్ఞతలు తెలియచేసారు. అనంతరం అతిధులను సన్మానించు కార్యక్రమం, విద్యార్ధులచే సామూహిక స్వీయ పఠనం, వారోత్సవాల సంధర్భంగా వివిధ పోటీలలో గెలుపొందిన విధ్యార్ధులకు అతిధులచే బహుమతి ప్రదానోత్సవం జరిగింది. గ్రంధాలయ వారోత్సవాలకు సహరించిన వారందరికి మరియు వారంరోజులు జరిగిన కార్యక్రమాలకు విశేష ప్రసారం కల్పించిన ప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ మీడియా వారందరికీ గ్రంధాలయ అధికారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు. గ్రేడ్ 2 గ్రంధాలయ అధికారిని శ్రీమతి సిహెచ్. ద్రాక్షవళి వందన సమర్పణ తో గ్రంధాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి.