విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ అధ్యక్షతన తూర్పు నియోజకవర్గంలోని 2,3,4,5,6,7 డివిజన్లకు సంబంధించి పెండింగులో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు మరియు నూతనంగా మంజూరు అయిన పనులు, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజలు అవినాష్ దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారం గురుంచి ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, ఇన్ ఛార్జ్ లతో జరిగిన సమీక్ష సమావేశంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ పాల్గొని ఆయా పనుల మీద సమీక్ష చేయడం జరిగింది. తక్షణమే స్పందించి అవినాష్ తెలియజేసిన అభివృద్ధి కార్యక్రమాలు సత్వరమే పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కమిషనర్, మేయర్ లు ఆదేశించారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …