విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏజెన్సీ ప్రాంతాలలో నివసిస్తున్న మాదిగ ల చైతన్యంకై ఐదో ప్రపంచ మాదిగల దినోత్సవం ఏజెన్సీ ప్రాంత మైన కుక్కునూరు మండలం, గణపవరం గ్రామం ఏలూరు జిల్లాలో నిర్వహిస్తున్నట్లు దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పిచ్చయ్య తెలియజేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో పిచ్చియ్య మాట్లాడుతూ ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగాస్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ఐదో ప్రపంచ మాదిగ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఏజెన్సీ ప్రాంతాల్లో సుమారు రెండు లక్షల మంది మాదిగలు జీవిస్తున్నారని తెలిపారు. వీరు విద్య, ఉద్యోగ, రాజకీయం వంటి అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని చెప్పారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న మాదిగలను చైతన్య పరచడానికి ఐదవ ప్రపంచ మాదిగల దినోత్సవం ఏజెన్సీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ దినోత్సవం సందర్భంగా ఏజెన్సీలో నివసించే మాదిగ జాతి సంస్కృతి సంప్రదాయాలు బయట ప్రపంచానికి తెలియజేయటానికి ఇన్ఫామ్ ఇంటర్నేషనల్ కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో దళిత సంక్షేమ సంఘం నాయకులు మట్టా విద్యార్థి, తగరం రాంబాబు, ఆదూరి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …