గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయాల ద్వారా ప్రజలకు నిర్దేశిత గడువులోగా మెరుగైన సేవలు అందేలా ఆయా కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలని, ప్రజలకు వార్డ్ సచివాలయాల్లో అందే సేవల పై పూర్తి అవగాహన కల్గించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ సచివాలయ కార్యదర్శులకు స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ చాంబర్ లో స్పందన, సచివాలయ కార్యదర్శులతో జూమ్ ద్వారా ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత సచివాలయ కార్యదర్శులతో మాట్లాడుతూ సచివాలయం పరిధిలో ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రతి సేవకు అందే అర్జీలు నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు. సచివాలయాల్లో కరెంట్ బిల్లులు, ఈ.సి. దరఖాస్తులు, జనన,మరణ ధ్రవీకరణ పత్రాలు, ఇతర ప్రభుత్వ సేవల పై వాలంటీర్లు ప్రతి ఒక్కరికి తెలియ చేయాలన్నారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు స్పందన నిర్వహించాలన్నారు. ఇంచార్జిగా ఉన్న కార్యదర్శులు తమ పరిధిలోని సచివాలయాల్లో సమన్వయం చేసుకోవాలని, ఇంకా ఎక్కడైనా ఇంచార్జిలు లేకుంటే వెంటనే ఏర్పాటు చేయాలని విభాగాదిపతులను ఆదేశించారు.
అనంతరం కమిషనర్ గతవారం స్పందన ఫిర్యాదులు, స్పందన పోర్టల్, ఈ.ఆర్.పి., వాట్స్ అప్, కాల్ సెంటర్ల ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారం పై అధికారులతో, సంబందిత కార్యదర్శులతో సమీక్షించి ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో ఎటువంటి అలసత్వం వహించవద్దని, నిర్దేశిత గడువులోగా ఫిర్యాదులు, అర్జీలు పరిష్కరించాల్సిన భాద్యత విభాగాధిపతిదేనని తెలిపారు.
సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 37 ఫిర్యాదులు అందాయని వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 11, ఇంజినీరింగ్ విభాగం 12, ప్రజారోగ్య విభాగం 9, రెవెన్యూ విభాగం 5 ఫిర్యాదులు అందాయని, ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.రోజా, డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, ఎస్.ఈ. భాస్కర్, సిటి ప్లానర్ మూర్తి, సిఎంఓహెచ్ డాక్టర్ విజయలక్ష్మి, ఎంహెచ్ఓ. డాక్టర్ భాను ప్రకాష్, మేనేజర్ శివన్నారాయణ, ఏ.సి.పి.లు, ఆర్.ఓ.లు, ఈ.ఈ లు, యస్.యస్ లు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …