Breaking News

గృహనిర్మాణ, నాడు`నేడు పనులలో అలసత్వం వహిస్తే సహించం…

-స్పందన అర్జీలను గ్రామ మండల స్థాయిలోనే పరిష్కరించండి…
-పాఠశాలల అభివృద్ధి పనులలో ప్రత్యేక దృష్టి పెట్టి పనులు చేయించలేకపోతున్నారా?
-వారం వారం వీసిలో కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మండల స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనుల ప్రగతిని స్థానిక కలెక్టరేట్‌లోని వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నందు బుధవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు జాయింట్‌కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌, ఆర్‌డివో, మండల స్పెషల్‌ ఆఫీసర్లు, మున్సిపల్‌ కమీషనర్లు, ఎంపిడివోలు, తహశీల్థార్లు, పంచాయతీరాజ్‌. హౌసింగ్‌ ఇఇలు, డిఇలు, ఏఇలతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి పాఠశాలలో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని, నిధులు ఉన్నప్పటికి పాఠశాలలోని విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయలను కల్పించలేకపోవడం విచారకరమన్నారు. రెడ్డిగూడెం మండలంలో పాఠశాలల నాడు నేడు పనులలో అంచనాలు కూడా వేయకపోవడం పై కలెక్టర్‌ అగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలోని నాడు` నేడు పనులలో మంజూరైన నిధులను ఆయా పనులకు ఖర్చు చేసి లక్ష్యాలను సాధించాలన్నారు. గ్రామమండల స్థాయిలో వచ్చే స్పందన ఫిర్యాధులను అవగాహన చేసుకుని, జిల్లా స్థాయి స్పందనకు పునరావృతం కాకుండా గ్రామ మండల స్థాయిలోనే పరిష్కరింప చేయాలని జూనియర్‌ కళాశాలలోని పనులకు అంచనాలను రూపొందించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటి సేవలకు సహకారం అందించేందుకు ముందుకు వచ్చిన అధికారులను అభినందిస్తున్నానన్నారు. రెడ్‌క్రాస్‌ సంస్థలో సభ్యులను చేర్చటంలో మరింత కృషి పెట్టాలన్నారు. జిల్లాలో 598 పాఠశాలలో చేపట్టిన అభివృద్ది పనులు పూర్తిచేసి ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలన్నారు. స్పందన ద్వారా ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలన్నారు. పెండిరగ్‌ అర్జీలకు గల కారణాల నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌, హౌసింగ్‌ పిడి శ్రీదేవి, రెవెన్యూ, మున్సిపల్‌, పంచాయితీరాజ్‌ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *