త్వరితగతిన పూర్తి చేయవలసినదిగా ఆదేశాలు,కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణలంక, రామలింగేశ్వర నగర్, రాణిగారి తోట ప్రాంతాలలో నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ సోమవారం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ జరుగుతున్నవంటివి ఆధునికకరణ పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు.వారధి ప్రక్కన గల రాణిగారి తోట రిటైనింగ్ వాల్ దగ్గర రిటైనింగ్ బ్యూటిఫికేషన్ పార్కులో జరుగుతున్నవంటివి రోడ్లు మరియు బెస్మెంట్ పనులను పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు త్వరితగతిన పూర్తి చేయవలసినదిగా ఇంజనీరింగ్ అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు.ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, డిప్యూటీ సిటి ప్లానర్ (ప్లానింగ్) జుబిన్ శిరన్ రాయ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, వి.చంద్ర శేఖర్, ఎస్.ఇ (ప్రాజెక్ట్స్) నరసింహ మూర్తి, శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawda
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …