విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా తాడిగపలోని మజిద్ ఎ హుసేనియ నవజీవన్ కామెటీ అధ్వర్యంలో మంగళవరం ఇస్తార్ ధావత్ జరిగింది. ఈ విందులో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం నేషనల్ వైస్ చైర్మన్ జమీల్ అహ్మద్ బేగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులందరూ తమకున్న దానిలో ఎంతో కొంత దానం చేయాలని, చెడు ఆలోచనలకు దూరంగా ఉండి అల్లాపై విశ్వాసం ఉంచి స్వచ్ఛమైన మనసుతో ఉపవాస దీక్షలు చేయాలన్నారు. సాయంత్రం దువా చేసి ఫలహారాలతో ఉపవాసాన్ని విరమణ చేసినారు. దేశ శ్రేయస్సు కోసం, మానవులందరి క్షేమం కోసం, అందరూ కలిసి మెలిసి సుఖ సంతోషాలతో వుండాలని నమాజ్ తర్వాత కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా విందులో పాల్గొన్నారు.
Tags vijayawda
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …