Breaking News

డాక్టర్‌ అచ్చెన్న హత్యపై వాస్తవాలకై సిట్టింగ్‌ జడ్జితో సమగ్ర విచారణ జరపాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎఎస్‌ఎస్‌ఈఎసి ఆధ్వర్యంలో విజయవాడ హోటల్‌ ఐలాపురంలో డాక్టర్‌ అచ్చన్న సంతాపసభ, కుల వివక్షత, అచ్చన్న హత్యలపై జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశం సిహెచ్‌ శివరామకృష్ణారావు అధ్యక్షతన జరిగింది. వక్తలు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై దాడులు, అకృత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్రానంతరం కూడా అంటరానితనం, దళితులపై వివక్ష కొనసాగడం విచాకరమన్నారు. డాక్టర్‌ అచ్చెన్న హత్యపై వాస్తవాలు వెలుగులోకి తెచ్చేందుకుగాను సిట్టింగ్‌ జడ్జీతో విచారణ జరిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు, దళిత, గిరిజన ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *