జిల్లా మరియు నగరపాలక సంస్థ పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న సురక్ష ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ యస్‌. ఢల్లీిరావు, స్థానిక కార్పొరేటర్‌ కె.అనితతో కలిసి 24వ డివిజన్‌ 88వ సచివాలయం పరిధిలోని గిరిపురం లో పరిశీలించారు. వాలంటీర్‌ కె.అనూష వార్డు సచివాలయ సిబ్బంది మొబైల్‌ యాప్‌ ద్వారా ఇంటింటా నిర్వహిస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా టి.ధనలక్ష్మి, యం.శాంతి కుటుంబాలకు సంబంధించిన వివరాలను పరిశీలించి, ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను వివరించే విధానాన్ని, సమస్యలను ఇంటి యజమానుల నుండి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు అందించలానే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 24వ తేది నుండి జిల్లాలో 16 మండలాలు 4 మున్సిపాలిటీలు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 605 గ్రామ వార్డు సచివాలయాలలో 10,256 మంది వాలంటీర్లు 7లక్షల 20 వేల 317 కుటుంబాలకు సంబంధించిన గృహాలకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలసుకుంటూరన్నారు. రోజుకి రెండు సచివాలయాల పరిధిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నేటి వరకు 128 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో 2,208 మంది వాలంటీర్లు 69,106 కుటుంబాలను సర్వే చేసి వివరాలను నమోదు చేస్తారన్నారు. వాలంటీర్లు గృహాలను సందర్శించినప్పుడు ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లకు సంబంధించి డాక్యుమెంట్లను సేకరించి సచివాలయాలకు అందజేసి టోకెన్‌ జనరేట్‌ చేయించి ఆయా టోకెన్‌లను అందజేయాలని ఆదేశించామన్నారు.ఈ సేవలన్ని ప్రజలకు ఉచితంగానే అందించాలని వాలంటీర్లకు సచివాలయ సిబ్బందికి స్పష్టంగా తెలిపామని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.గిరిపురంలో నివాసం ఉంటున్న టి.ధనలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమలాంటి పేద కుటుంబానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయన్నారు. రేషన్‌కార్డులో తన కుమార్తె పేరును కూడా నమోదు చేయాలని, ఆదాయ దృవీకరణ పత్రం మంజూరు చేయాలని కోరారు.
యం.శాంతి తనకు కుల, జనన దృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరారు.క్షేత్రస్థాయి పరిశీలనలో నగరపాలక సంస్థ అడిషనల్‌ కమీషనర్‌ సత్యవతి, నగరపాలక సంస్థ యుసిడి శకుంతల దేవి, విఆర్‌వో వెంకటేశ్వరరావు, వార్డు సచివాలయ అడ్మిన్‌ సతీష్‌ కుమార్‌, ఎడ్యుకేషన్‌ సెక్రటరీ మానస, హెల్త్‌ సెక్రటరీ ఇంద్రజ, శానిటేషన్‌ సెక్రటరీ మల్లికార్జునరావు, తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *