గొప్ప మనసున్న నాయకుడు సీఎం వైఎస్ జగన్‌

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-24 వ డివిజన్ 36 వ సచివాలయ పరిధిలో నాలుగో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలోనే గొప్ప మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి అని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 24 వ డివిజన్ 36 వ వార్డు సచివాలయ పరిధిలో సోమవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కుక్కల అనితతో కలిసి ఆయన పాల్గొన్నారు. కృష్ణారావు వీధి, రామనాథం వీధులలో విస్తృతంగా పర్యటించి 90 గడపలను సందర్శించారు. ప్రతిఒక్కరినీ పేరుపేరున ఆప్యాయంగా పలకరిస్తూ.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత అవగాహన కల్పించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన కరపత్రాలను అందజేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అధికారులు, ప్రభుత్వ సిబ్బందిలో జవాబుదారీతనాన్ని పెంచిందని మల్లాది విష్ణు అన్నారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై అర్జీలు స్వీకరించారు. మ్యాన్ హోల్స్ నుంచి మురుగు బయటకు పొంగకుండా.. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని వీఎంసీ అధికారులకు చెప్పారు. కృష్ణారావు వీధి, రామనాథం వీధులలో నూతన రహదారుల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయవలసిందిగా సూచించారు. అలాగే పేదలందరికీ ఇళ్ల పథకం తొలిదశ నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని పీఓయూసిడి విభాగాన్ని ఆదేశించారు.
పేదవాడి సంక్షేమం చూసి ఓర్వలేక దుష్ప్రచారం
పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని మల్లాది విష్ణు తెలిపారు. నగదు బదిలీ సహా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంస్కరణలను ఆర్థిక నిపుణులు సైతం కీర్తిస్తున్నారన్నారు. నవరత్నాల ద్వారా నాలుగేళ్లలో అక్షరాల రూ.2.16 లక్షల కోట్ల నగదును ఈ ప్రభుత్వం అక్కచెల్లెమ్మల ఖాతాలలో జమ చేసినట్లు వెల్లడించారు. కానీ మేనిఫెస్టోలోని ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో చంద్రబాబు ఉన్నారని మల్లాది విష్ణు విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతిఒక్క పేద కుటుంబానికి ఏదో ఒక పథకం రూపంలో చేకూరుతున్న మేలును చూసి జీర్ణించుకోలేక బురదచల్లే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాల కుట్ర రాజకీయాలను ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి, నాయకులు కుక్కల రమేష్, కొమ్ము చంటి, బెల్లపు సత్యనారాయణ, కంభంపాటి మోజస్, నాగభూషణం, చింతకాయల చిట్టిబాబు, క్రాంతి, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *