– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి పేదవాడికి సంక్షేమం, ప్రభుత్వ పాలనను చేరువచేసేందుకు జగనన్న సురక్ష కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 27 వ డివిజన్ దుర్గాపురంలో బుధవారం నిర్వహించిన సురక్ష శిబిరంలో డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాంతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమ లక్ష్యాన్ని ప్రతిఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఉందని మల్లాది విష్ణు అన్నారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేక సంక్షేమ పథకాలు అందని వారికి లబ్ధి చేకూర్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్యాంపుల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించి.. 11 రకాల ధ్రువీకరణ పత్రాలు పూర్తి ఉచితంగా అందజేయడం జరుగుతోందన్నారు. డివిజన్లోని 4 సచివాలయాల పరిధిలో 725 మంది వివిధ రకాల పత్రాలు కోసం వినతులు సమర్పించినట్లు మల్లాది విష్ణు తెలిపారు. వీరిలో 239 మంది కుల సర్టిఫికెట్ల కోసం., 222 మంది ఆదాయ., ఇద్దరు EWS., 10 మంది బియ్యం కార్డుల కోసం అర్జీలు ఇచ్చినట్లు చెప్పారు. వీరందరికీ ఎటువంటి రుసుం లేకుండా సర్టిఫికెట్లను అందజేసినట్లు చెప్పారు. ఆధార్ సమస్యలతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించేందుకు క్యాంపులలో హెల్ప్ డెస్క్ లతో పాటు ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. ప్రతి శాఖకు సంబంధించిన అధికారులు శిబిరంలో ఉంటారని.. కనుక ప్రభుత్వ సేవలను ప్రతిఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వ పథకాలు, సేవలతో సంతృప్తి చెందిన లబ్ధిదారులు.. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ 9052690526 నెంబర్ కి ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరారు. అనంతరం సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఓయూసిడి శకుంతల, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawda
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …