విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు అన్నివర్గాల ప్రజల నుంచి ఆమోదం లభిస్తోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. వాంబేకాలనీకి చెందిన జనంలో మనం స్వచ్ఛంద సంస్థ ఛైర్మన్ పొదిగింటి నాగరాజు బుధవారం మిత్రబృందంతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్ సీపీలోకి చేరారు. వీరికి మల్లాది విష్ణు పార్టీ కండువా కప్పి వైఎస్సార్ సీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై, ఆయన పాలనాదక్షతపై నమ్మకంతో పెద్దసంఖ్యలో నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభపరిణామని మల్లాది విష్ణు అన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రజలు పూర్తి సంతృప్తికరంగా ఉన్నారనడానికి ఇదొక నిదర్శనమన్నారు. అంకితభావంతో పనిచేస్తూ.. క్రమశిక్షణతో మెలిగే వారికి పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాల సాధన కోసం పనిచేసి, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే రోజుల్లో సెంట్రల్లో మరిన్ని చేరికలు ఉంటాయని.. 2024లో వైఎస్సార్ సీపీ అఖండ విజయం తథ్యమని పేర్కొన్నారు. పొదిగింటి నాగరాజు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మల్లాది విష్ణు సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. ఆయన సారథ్యంలో సీఎం జగన్ ఆశయాల సాధనకు శక్తివంచన లేకుండా పనిచేస్తామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు బెవర నారాయణ, బత్తుల దుర్గారావు, జనంలో మనం స్వచ్ఛంద సంస్థ ట్రెజరర్ నబీగారు వెంకటేశ్వరరావు, సంస్థ గౌరవ అధ్యక్షులు భోగాది అనిల్ కుమార్, సభ్యులు మ్యాత్యూస్, కిరణ్, అజీమ్ తదితరులు పాల్గొన్నారు.