విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దివంగత నేత రాజశేఖర్ రెడ్డి జయంతి ని పురస్కరించుకుని దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 11వ డివిజన్ రెల్లిస్ కాలని కి చెందిన దుర్గ పక్షవాతంతో బాధపడుతున్న దుర్గ కి ట్రస్ట్ ద్వారా అవినాష్ రూ.10,000/- విలువ చేసే వీల్ చైర్ అందజేశారు. అంతేకాకుండా భవిష్యత్ లో వారికీ ఏ అవసరం ఉన్న ట్రస్ట్ ద్వారా, ప్రభుత్వం ద్వారా అండగా ఉంటామని అవినాష్ భరోసా ఇచ్చారు.రాబోయే రోజుల్లో కూడా మా సేవా కార్యక్రమాలు ఇలాగే నిరాటంకంగా జరుపుతామని,పూర్తి సహాయసహకారాలు ఉంటాయని అవినాష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ ఇంచార్జ్ పర్వతనేని పవన్,వైస్సార్సీపీ నాయకులు కె. కె రవి,ఉదయ్,చందు, దుర్గా ప్రసాద్,చోటు రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawda
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …